TSPSC Leak Case: పేపర్ లీక్ కేసులో ఓ ప్రజాప్రతినిధి, అతని కూతురు అరెస్ట్.. డీఈతో డీల్ కుదుర్చుకుని..

TSPSC Leak Case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులోమరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. కరీంనగర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ భర్త అయిన మద్దెల శ్రీనివాస్, అతని కూతురు మద్దెల సాహితీని జులై 12న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. డిఈ పోల రమేశ్‌ డీల్ కుదుర్చుకుని సాహితి పరీక్షలు రాసినట్లు అధికారులు

TSPSC Leak Case: పేపర్ లీక్ కేసులో ఓ ప్రజాప్రతినిధి, అతని కూతురు అరెస్ట్.. డీఈతో డీల్ కుదుర్చుకుని..
TSPSC Leak Case

Updated on: Jul 13, 2023 | 6:55 AM

TSPSC Leak Case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులోమరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. కరీంనగర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ భర్త అయిన మద్దెల శ్రీనివాస్, అతని కూతురు మద్దెల సాహితీని జులై 12న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. డీఈ పోల రమేశ్‌ డీల్ కుదుర్చుకుని సాహితి పరీక్షలు రాసినట్లు అధికారులు గుర్తించారు. విచారణలో ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి వెంటనే వారిని అరెస్ట్ చేశారు.

మరోవైపు, పేపర్‌ లీకేజీ కేసులో A-50 ముద్దాయిగా ఉన్న రమేష్‌ నుంచి ఏఈఈ ఎగ్జామ్ పేపర్‌ను కొనుగోలు చేసిన ఆరుగురిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి నుంచి రమేష్ అకౌంట్‌కి జరిగిన అన్‌లైన్ లావాదేవీల ఆధారంగా అధికారులు ఈ వ్యవహారాన్ని కూపీ లాగారు. ఇక బుధవారం జరిగిన మద్దెల శ్రీనివాస్, అతని కూతురు సాహితీ అరెస్ట్‌తో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 80 కి చేరింది. అలాగే ఈ వ్యవహారంలోమరిన్ని అరెస్టులుండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..