Kadiyam Srihari: తెలంగాణ నదీ జలాల వ్యవహారంలో కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ గుస్సా..

|

Feb 13, 2024 | 12:04 PM

తెలంగాణ నదీ జలాలపైన కేంద్రం పెత్తనానికి దాసోహమన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ చలో నల్లగొండ సభకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు సహచర ఎమ్మెల్యేలందరూ బహిరంగ సభకు ప్రత్యేక బస్సులో బయలుదేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాకుండా.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు.

Kadiyam Srihari: తెలంగాణ నదీ జలాల వ్యవహారంలో కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ గుస్సా..
Kadiam Srihari
Follow us on

తెలంగాణ నదీ జలాలపైన కేంద్రం పెత్తనానికి దాసోహమన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ చలో నల్లగొండ సభకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు సహచర ఎమ్మెల్యేలందరూ బహిరంగ సభకు ప్రత్యేక బస్సులో బయలుదేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాకుండా.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ నుంచి నల్లగొండ సభకు వెళ్లే క్రమంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ నదీ జలాల పైన కేంద్రం పెత్తనాన్ని గత పది సంవత్సరాలుగా అడ్డుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం రెండు నెలల్లోనే కృష్ణ, గోదావరి నది జలాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పజెప్పిందని తెలిపారు.

తెలంగాణ రైతాంగం భవిష్యత్తును అంధకారం చేసే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ గళం ఎత్తిందని పేర్కొన్నారు. నది జలాల పరిరక్షణ కోసం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు నల్గొండ జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ భయపడిందని, మంగళవారం జరిగిన అసెంబ్లీలో తమపై అబద్దాలు ప్రచారం చేసిందన్నారు. తెలంగాణ ప్రజలకు నిజానిజాలు తెలియజేయాల్సిన అవసరం తమపై ఉందన్నారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. ఈరోజు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ ప్రజలకు నది జలాల పైన, వాటిని కేంద్రానికి అప్పజెప్పితే వచ్చే నష్టాల పైన సభలో వివరిస్తారని తెలిపారు. తెలంగాణ నదీ జలాల పైన కేంద్రం పెద్దనాన్ని ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోమన్నారు. ఈరోజు ప్రారంభమైన జల ఉద్యమం మొదటి అడుగు మాత్రమే అని హెచ్చరించారు. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..