Telangana: కాంగ్రెస్ 100 రోజుల పాలనపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలు..

వంద రోజుల కాంగ్రెస్ పరిపాలనకు పార్లమెంట్ ఎన్నికలను రెఫరేండంగా భావించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలకు వసూలు చేయడం.. ముడుపులు కట్టి రావడమే తప్ప పరిపాలన సోయలేదని విమర్శించారు. కరువుతో అల్లాడుతున్న రైతుల గోడు కాంగ్రెస్ నేతలకు పట్టడం లేదని ఆయన అన్నారు.

Telangana: కాంగ్రెస్ 100 రోజుల పాలనపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలు..
Former Minister Jagadesh Re

Edited By: Srikar T

Updated on: Mar 20, 2024 | 11:50 AM

వంద రోజుల కాంగ్రెస్ పరిపాలనకు పార్లమెంట్ ఎన్నికలను రెఫరేండంగా భావించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలకు వసూలు చేయడం.. ముడుపులు కట్టి రావడమే తప్ప పరిపాలన సోయలేదని విమర్శించారు. కరువుతో అల్లాడుతున్న రైతుల గోడు కాంగ్రెస్ నేతలకు పట్టడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యవసాయంగాన్ని పథకం ప్రకారం దెబ్బ తీసి, కాంగ్రెస్ సర్కార్ క్రిమినల్‎గా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. కరువుపై అధ్యయనం చేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

పంట పొలాలను పరిశీలించిన జగదీశ్ రెడ్డి..

నల్లగొండ జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలు, నిమ్మ తోటలను జగదీష్ రెడ్డి పరిశీలించారు. కరువు పరిస్థితుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎండి పోయిన పంటలతో రైతులు బోరున విలపిస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు. మూసి ప్రాజెక్టు ద్వారా పంటలకు నీరు అందించే అవకాశం ఉన్న ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకతో మాట్లాడి నారాయణపూర్, ఆల్మట్టి డ్యామ్‎లనుండి నీటిని తెప్పించి రైతులకి అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళిన ఎండిన పంట పొలాలే దర్శనమిస్తున్నాయని, పెట్టుబడులన్నీ మట్టిలో కలిసిపోయి రైతులు విలపిస్తున్నారని అన్నారు. మంత్రులు, అధికారులు రైతుల వంక కన్నెత్తి చూడట్లేదని, ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మంత్రులకు రాజకీయాలు, అక్రమ వసూళ్లు, దందాలు తప్ప, రైతుల గోడు పట్టట్లేదని విమర్శించారు.

కాంగ్రెస్ – బిజెపిలకు అభ్యర్థులు లేరు..

జాతీయ పార్టీలని ఫోజులు కొడుతున్న కాంగ్రెస్, బిజెపిలకు ఎంపీ అభ్యర్థులు లేకనే తమ పార్టీ నేతలను చేర్చుకుంటున్నారని విమర్శించారు. తాము టికెట్లు ఇవ్వకుండా తీసేసిన వారే కాంగ్రెస్, బిజెపిలలో చేరుతున్నారన్నారు. రేవంత్ గేట్లు తెరిచినంత మాత్రాన బీఆర్ఎస్‎కు నష్టమేమీ లేదని అన్నారు. కరువుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సమీక్ష కూడా చేయలేదని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మంత్రి కోమటిరెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారు..

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మందిని భయపెట్టి, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడమే తప్ప రైతుల సోయ లేదని మండిపడ్డారు. కరువుతో అల్లాడుతున్న రైతంగాన్ని ఆదుకోలేని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన విమర్శించారు. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‎లు ఉత్తర కుమారులని, ప్రగల్భాలు పలకడం తప్పా దేనికి పనికిరారని ఎద్దేవా చేశారు. వారికి ఎంతసేపు రాజకీయాలు చేయడం తప్ప రైతుల సంక్షేమం పట్టలేదని జగదీశ్ రెడ్డి విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..