తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖను పంపించారు. పార్టీలో పని చేసేవారిని ప్రోత్సహించడం లేదంటూ ఆరోపించారు. ఈటల రాజేందర్ బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ.. చంద్రశేఖర్ వెనక్కి తగ్గలేదు. పార్టీని వీడి విషయంలో పునరాలోచన లేదని స్పష్టం చేశారు చంద్రశేఖర్. కాగా, బీజేపీని వీడియోన చంద్రశేఖర్.. కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని, ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరిగినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
చంద్రశేఖర్ గతంలో టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో పనిచేసి మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్ ఎమ్మేల్యేగా గెలిచారు చంద్రశేఖర్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుంచి అసెంబ్లీకి, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా విజయం దక్కలేదు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరినా అక్కడ ఇమడలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఇక నేను ఉండలేనంటూ పార్టీని వీడి బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా పార్టీలో పరిస్థితులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు లేఖను కూడా విడుదల చేశారు చంద్రశేఖర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..