
బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిపోయిన వారిని మళ్ళీ పార్టీలోకి తీసుకొము అని క్లియర్గా చెప్పారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హోస్లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా అక్కడికి రాష్ట్రం నలుమూలాల నుండి వచ్చిన ప్రజలతో సుమారు రెండు గంటల పాటు ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మొన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం వల్ల మనకు మంచే జరిగింద అని, మళ్ళీ గట్టిగా పనిచేయడానికి అవకాశం వచ్చిందన్నారు. ఒక్కసారి మనం ఓడిపోవడంతో మన వాళ్ళు ఎవరు.. మన మంది ఎవరు అనేది క్లియర్గా అర్ధం అయ్యింది అన్నారు. ప్రతి పార్టీలో గోడలు దుంకే నేతలు ఉంటారు అని, వాళ్లకు పదవులు తప్ప వేరే ఆలోచన ఉండదు అన్నారు. మళ్ళీ సాధారణ ఎన్నికలు వస్తే మన పార్టీ ముందు బీఫామ్ కోసం లైన్ల్ కడుతారు అని, కానీ ఇప్పుడు పార్టీ నుండి వెళ్లిపోయిన వారిని మళ్ళీ పార్టీలోకి రానివ్వం అన్నారు.
బీఆర్ఎస్ ఉద్యమం నుండి వచ్చింది అని, ఒక ఎమ్మెల్యే నో, ఎంపినో పార్టీ నుండి ఇతర పార్టీలోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదన్నారు. దళిత బంధు పథకం చాలా మంచిది అని కానీ దళితబంధు తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది మనకు ఓట్లు వేయలేదు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చింది అని.. వాటిని నమ్మి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన మూడు నెలలకే గ్రామాల్లో ప్రజలు మూతి విరుస్తున్నారు. మిషన్ భగీరథ, దళిత బంధు, రైతు బంధు లాంటి పథకాలు సరిగ్గా ప్రజలకు అందడం లేదన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలో జాయిన్ అయ్యాడు అని అతనికి భవిష్యత్లో కూడా పార్టీలో స్థానం ఉంటుంది అన్నారు. రెండు, మూడు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తాం అన్నారు. రాబోయే రోజుల్లో 100 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచి తిరుతుందని జోస్యం చెప్పారు కేసీఆర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..