Watch: ప్రాణాలు కాపాడారు… ఎలుగుబంటిని అధికారులు ఎలా రక్షించారో చూడండి..

ఒడ్డుకు చేరేందుకు నానాతంటాలు పడింది. బావిలో పడిపోయిన ఎలుగు బంటిని రక్షించారు. దాన్ని బయటకు రప్పించడంలో చాకచక్యంగా వ్యవహరించారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇప్పుడు వైరల్ అవుతోంది.

Watch: ప్రాణాలు కాపాడారు... ఎలుగుబంటిని అధికారులు ఎలా రక్షించారో చూడండి..
Bear From Well In Jagtial D
Follow us
Sanjay Kasula

|

Updated on: May 23, 2022 | 8:37 AM

పాపం బల్లూకం. ఎలా పడిందో తెలియదు కాని అనుకోకుండా బావిలో పడింది. ఒడ్డుకు చేరేందుకు నానాతంటాలు పడింది. బావిలో పడిపోయిన ఎలుగు బంటిని రక్షించారు. దాన్ని బయటకు రప్పించడంలో చాకచక్యంగా వ్యవహరించారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇప్పుడు వైరల్ అవుతోంది. బావి లాంటి నిర్మాణంలో పడిపోయిన ఎలుగుబంటిని (Bear)రక్షించేందుకు అధికారులు మొదట నిచ్చెన జార విడిచారు. అయితే, అది బయటకు వచ్చి తమపై దాడి చేయకుండా ఉండేందుకు ముందుగానే అక్కడి నుంచి పారిపోయారు. దీంతో బయటకు వచ్చిన ఎలుగు అక్కడి నుంచి అడవిలోకి పోరిపోయింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్ శివారు వ్యవసాయ బావిలో సీన్ ఇది. ఎలుగుబంటి సహా 2 పిల్ల ఎలుగుబంట్లు ప్రమాదవశాత్తు బావిలో పడ్డాయి. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కొండగట్టు డిప్యూటీ రేంజ్ అధికారి బెస్ క్యాంపు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో ఉన్నవాటిని రక్షించేందుకు తాడు, నిచ్చెన వేశారు. ఒడ్డుకు చేరాలన్న వాటి తపన కాసేపు ఫలించలేదు. చివరకు మూడు ఎలుగుబంట్లు నిచ్చెన సాయంతో గట్టెక్కాయి. దాహం తీర్చుకోవడం కోసం వ్యవసాయ బావి దగ్గరకు వచ్చిన ఎలుగుబండ్లు ప్రమాదవశాత్తు జారీ పడి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆ వీడియో మీరూ చూసేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో