Telangana News: కారులో పార్సిల్స్.. ఏంటని చెక్ చేయగా.. పోలీసులకు కళ్లు బైర్లు కమ్మేసీన్..

| Edited By: Velpula Bharath Rao

Dec 18, 2024 | 7:01 AM

కొందరు యువకులు తెలిసి తెలియని వయసులో జల్సాలకు అలవాటు పడిపోయి జైలు పాలవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక జైల్లో పరిచయమైన ఐదుగురు నేరస్థులు ముఠాగా ఏర్పడి ఏకంగా గంజాయి దందాలో దిగిపోయారు. చివరికి పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

Telangana News: కారులో పార్సిల్స్.. ఏంటని చెక్ చేయగా.. పోలీసులకు కళ్లు బైర్లు కమ్మేసీన్..
Five Persons Arrested For Dealing In Ganja In Hyderabad
Follow us on

ప్రస్తుతం యువత చెడుదారులు తొక్కుతూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురుద్దేశానికి అలవాటు పడుతున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. తెలిసి తెలియని వయసులో జల్సాలకు అలవాటు పడిపోయి జైలు పాలవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక జైల్లో పరిచయమైన ఐదుగురు నేరస్థులు ముఠాగా ఏర్పడి ఏకంగా గంజాయి దందాలో దిగిపోయారు. చివరికి పోలీసులకు పట్టుబడ్డారు. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఎన్నో పాత కేసుల్లో నేరస్థులుగా ఉన్న ఓ ఐదుగురు ముఠాగా ఏర్పడి హైదరాబాద్ నగరంలో వ్యాపారం చేసేందుకు ఒడిశా నుంచి గంజాయి రవాణా చేస్తున్నారు. పక్కా సమాచారం మేరకు మలక్‌పేట్ పరిధిలోని సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులు రంగంలోకి ఆ ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 కిలోల గంజాయి, ఒక కారు, ఒక బైక్, ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ స్వామి ఈ గంజాయి దందాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.

గడ్డి అన్నారం చౌరస్తా వద్ద సోమవారం సాయంత్రం ఎస్ఐ నవీన్ టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న బాలెనో కారును తనిఖీ చేయగా గంజాయి పట్టుబడినట్లు డీసీపీ స్వామి తెలిపారు. ఈ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ గ్రామానికి చెందిన ఇక్కిరి భాస్కర్, వల్లందాసు వంశీ, బోయిని వంశీ, పొడిచేడుకు చెందిన జిట్టా కిరణ్, మహబూబ్​నగర్​ జిల్లా వెల్లంపల్లి గ్రామానికి చెందిన అల భరత్ కుమార్ రెడ్డిలను అరెస్ట్‌ చేసినట్లు ఆయన చెప్పారు. అనంతరం వారి కారులో ఉన్న 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితుల గురించి విచారించగా.. వారిపై అప్పటికే వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి కేసులు నమోదైనట్లు గుర్తించామని తెలిపారు. జైలులో నిందితులుగా ఉన్నప్పుడే వీరంతా కలిసి ఒక ముఠాగా ఏర్పడి బయటకు వచ్చాక వరుసగా గంజాయి సరఫరాకు పాల్పడుతున్నారని వివరించారు. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్ నగరంలోని ధూల్ పేటలో విక్రయించడం ఈ ముఠాకి అలవాటు అని.. ఇదే క్రమంలో గంజాయి తరలిస్తుండగా తనిఖీల్లో భాగంగా గడ్డి అన్నారం చౌరస్తా వద్ద నిందితులను పట్టుకున్నామని డీసీపీ స్వామి వివరాలు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి