Telangana: ఆ జిల్లాలో ‘కరోనా’ టెన్షన్.. ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్..!

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయింది. మొదట పాజిటివ్ వచ్చిన మహిళ ఎంజీఎం ఆస్పత్రిలో కోవిడ్ వార్డులో చికిత్స పొందుతుంటే..

Telangana: ఆ జిల్లాలో కరోనా టెన్షన్.. ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్..!
Corona Cases

Edited By:

Updated on: Dec 25, 2023 | 1:46 PM

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయింది. మొదట పాజిటివ్ వచ్చిన మహిళ ఎంజీఎం ఆస్పత్రిలో కోవిడ్ వార్డులో చికిత్స పొందుతుంటే.. ఆమెతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్ ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఘనపురం మండలం గాంధీనగర్‌కు చెందిన ఆగమ్మ అనే 60 ఏళ్ల మహిళకు నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఆమెకు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ మహిళ కుటుంబ సభ్యుల నుంచి శాంపిల్స్ సేకరించి KMCలోని ల్యాబ్‌కు పంపారు. ఆ మహిళ కుటుంబ సభ్యులు నలుగురికి కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ రావడంతో ఊరంతా భయాందోళన చెందుతున్నారు. వారితో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న వారిలో కొత్త టెన్షన్ పట్టుకుంది. అయితే ఎలాంటి ప్రమాదం లేదని.. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య సిబ్బంది భరోసా కల్పిస్తున్నారు.