Smoking cigarette: పొగతాగడం అనారోగ్యానికే కాదు.. ప్రమాదాలకూ కారణం.. కావాలంటే ఈ లెక్కలే చూడండి..

Smoking cigarette: పొగతాగడం ఆరోగ్యానికి ప్రమాదమనే విషయం ధూమపానం చేసేవారికి కూడా తెలుసు కానీ అలవాటును వదులుకోవడానికి ఇష్టపడరు. అందులోనూ....

Smoking cigarette: పొగతాగడం అనారోగ్యానికే కాదు.. ప్రమాదాలకూ కారణం.. కావాలంటే ఈ లెక్కలే చూడండి..
Smoking Causes Fire Aaccidents

Updated on: Apr 15, 2021 | 9:58 PM

Smoking cigarette: పొగతాగడం ఆరోగ్యానికి ప్రమాదమనే విషయం ధూమపానం చేసేవారికి కూడా తెలుసు కానీ అలవాటును వదులుకోవడానికి ఇష్టపడరు. అందులోనూ పొగతాగడం వల్ల తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవడంతో పాటు.. ఇతరుల ఆరోగ్యాలను కూడా దెబ్బతిస్తుంటారు. అయితే ఇది కేవలం ఆరోగ్యాలకే పరిమితం కాకుండా ప్రమాదాలకు దారి తీస్తోందని మీకు తెలుసా? తాజాగా తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ విడుదల చేసిన లెక్కలే దీనికి ప్రత్యక్ష ఉదారణగా నిలుస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. 2019, 2020లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 8,855 అగ్నిప్రమాదాలు పొగరాయుళ్లు సిగరెట్‌, బీడీ తాగిన తర్వాత పీకలను నిర్లక్ష్యంగా నిప్పు ఆర్పకుండా పారవేయడం వల్లే జరిగాయని రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ వెల్లడించింది. బుధవారం నుంచి అగ్నిమాపకశాఖ వారోత్సవాలు మొదలైన సందర్భంగా రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలు, కారణాలు తదితర అంశాలను ఆ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన రెండేళ్లలో 174 మంది ప్రాణాలను అగ్నిమాపక సిబ్బంది స్పందించి కాపడినట్లు తెలిపారు. ఇక సిబ్బంది సమయానికి సంఘటన స్థలానికి చేరుకోవడం వల్ల.. 2019లో రూ.770.468 కోట్లు, 2020లో రూ.959.85 కోట్ల మేర ఆస్తి నష్టాన్ని నివారించినట్టు చెప్పుకొచ్చారు. ఎలక్ట్రికల్‌ పరికరాల కారణంగా గడిచిన రెండేళ్లలో 4,718 ప్రమాదాలు జరిగాయని వివరించారు.

Also Read: ఒంటెల కోసం చైనా ఎవరు చేయని పని చేసింది..! దీని వెనుక కారణం ఏంటో తెలుసా..?

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. చికిత్సకు రూ. 16 కోట్లు.. సాయం చేయాలని విజ్ఞప్తి చేసిన స్టార్ హీరో..

మీరు బైక్ కోసం చూస్తున్నారా.? తక్కువ ధరకే అదిరిపోయే ‌బైక్‌లు మీ సొంతం.. వివరాలు ఇవిగో.!