Telangana: కోడి పుంజు కోసం ఘర్షణ పడిన రెండు ఫ్యామిలీలు.. మహిళా సర్పంచ్‌కు గాయాలు

గ్రామ సర్పంచ్ సమ్మక్క కుటుంబంపై ఇదే గ్రామానికి చెందిన ఆలం నర్సింహరావు కుటుంబం దాడిచేశారు.. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన సర్పంచ్ కుటుంబం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. 

Telangana: కోడి పుంజు కోసం ఘర్షణ పడిన రెండు ఫ్యామిలీలు.. మహిళా సర్పంచ్‌కు గాయాలు
Two Families Fight For Cock
Follow us
Surya Kala

|

Updated on: Jan 07, 2023 | 10:44 AM

కోడి పుంజు తెచ్చిన పంచాయతీ ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత దారితీసింది.. ఏకంగా గ్రామ సర్పంచ్ పై దాడికి దారి తీసింది.. కోడి కోసం జరిగిన ఘర్షణలో ఓ మహిళా సర్పంచ్ కి గాయాలయ్యా యి..దీంతో ఆస్పత్రిలో చేర్చారు.. కోడి పుంజును అడ్డం పెట్టుకొని పాతకక్షలతో దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.  ఈ వింత సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామంలో జరిగింది.. గ్రామ సర్పంచ్ సమ్మక్క కుటుంబంపై ఇదే గ్రామానికి చెందిన ఆలం నర్సింహరావు కుటుంబం దాడిచేశారు.. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన సర్పంచ్ కుటుంబం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..

కోడి పుంజు విషయంలో ఈ ఘర్షణ జరిగింది.. సర్పంచ్ సమ్మక్క కుటుంబానికి చెందిన పెంపకపు కోడి రెండు రోజుల క్రితం మాయమైంది.. ఆ పుంజు రెండు రోజుల తర్వాత పొరుగు ఇంట్లో ప్రత్యక్షమైంది.. ఈ పుంజు తమదే అని సర్పంచ్ కుటుంబం నిలదీయడంతో గొడవ రగులుకుంది.

ఇదే అదునుగా భావించిన ఆలం నరసింహారావ్ కుటుంబం సర్పంచ్ సమ్మక్క కుటుంబంపై దాడి చేశారు.. ఈ ఘటనలో సర్పంచ్ సమ్మక్కకు తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కోడి కోసం జరిగిన గొడవలో పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..