డాక్టర్ల నిర్లక్ష్యంతో పసికందు మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన..

డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మార్చి 19న ఉదయం డెలివరీ కోసం జిల్లా కేంద్రంలోని గొల్లవాడకు చెందిన ధనలక్ష్మి అనే నిండు గర్భిణి ప్రభుత్వ హాస్పిటల్‎లో అడ్మిట్ అయింది. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో డాక్టర్లు నార్మల్ డెలివరీ చేశారు.

డాక్టర్ల నిర్లక్ష్యంతో పసికందు మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన..
Baby Dies

Edited By: Srikar T

Updated on: Mar 20, 2024 | 9:06 AM

డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మార్చి 19న ఉదయం డెలివరీ కోసం జిల్లా కేంద్రంలోని గొల్లవాడకు చెందిన ధనలక్ష్మి అనే నిండు గర్భిణి ప్రభుత్వ హాస్పిటల్‎లో అడ్మిట్ అయింది. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో డాక్టర్లు నార్మల్ డెలివరీ చేశారు. ధనలక్ష్మి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో పుట్టిన పాపకు పాలు ఇవ్వడంతో తీవ్ర అస్వస్థకు గురైంది.

దీంతో వెంటనే గమనించిన బాలింత ధనలక్ష్మి కుటుంబ సభ్యులు హాస్పిటల్‎లోని చిన్న పిల్లల వార్డుకు తరలించారు. అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‎కు తరలించారు. మార్గమధ్యంలోనే పసికందు మృతి చెందినట్లు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. తల్లిపాలు ఊపిరితిత్తులకు వెళ్లడం వల్లనే పసికందు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్‎లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు సరైన సమయానికి లేకపోవడం వల్లనే, విధులలో నిర్లక్ష్యం వల్ల పసికందు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ హాస్పిటల్‎లో ఆందోళనకు దిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..