Fake Hand Sanitiser: హైదరాబాద్ శివారులో నకిలీ శానిటైజర్ల తయారీ.. 5 లక్షల విలువైన శానిటైజర్లు స్వాధీనం

|

May 17, 2021 | 7:17 AM

Corona Criminals: మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ పరిధిలో నకిలీ శానిటైజర్లు తయారు చేస్తున్న కొందరిని శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.5 లక్షల విలువ చేసే నకిలీ శానిటైజర్..

Fake Hand Sanitiser: హైదరాబాద్ శివారులో నకిలీ శానిటైజర్ల తయారీ.. 5 లక్షల విలువైన శానిటైజర్లు స్వాధీనం
Fake Sanitiser Unit Busted
Follow us on

మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ పరిధిలో నకిలీ శానిటైజర్లు తయారు చేస్తున్న కొందరిని శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.5 లక్షల విలువ చేసే నకిలీ శానిటైజర్ బాలిళ్లు, క్యాన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ పరిధిలోని మధుబన్‌కాలనీలో ఓ ఇంట్లో శ్రీ భూవి ప్రొడక్ట్‌ పేరుతోఎస్‌.సుబ్రమణ్యం, బి.శ్రీనివాస్‌, కె.సుస్మిత నకిలీ శానిటైజర్లను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

కొవిడ్‌ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని శానిటైజర్‌ విక్రయాలపై దృష్టి పెట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రముఖ బ్రాండ్ల పేరుతో స్టిక్కర్లు, బ్యాచ్‌ నంబర్లు గోదాములో బాటిళ్లకు అతికించి అందులో నకిలీ శానిటైజర్‌ను నింపి టోకున నగరంలోని దుకాణాలకు విక్రయిస్తున్నాడు. లీటరు రూ.100 చొప్పున క్యాన్లలో విక్రయించడంతో పాటు చిన్న స్ప్రే బాటిల్స్‌ హోల్‌సేల్‌ ధరలకు ఫ్యాన్సీ, మందుల దుకాణాలకు విక్రయిస్తున్నాడు. దీనికి సంబంధించిన గోదాము కోమలా విలాస్‌ సెంటరులో ఏర్పాటు చేసుకున్నాడు.

దీనిపై సమాచారం అందుకున్న శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు ఆదివారం ఆ ఇంటిపై దాడి చేసి.. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రూ.5లక్షల విలువగల నకిలీ శానిటైజర్లు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరికొంతమంది నకిలీ శానిటైజర్ల తయారీదారుల వివరాలపై కూడా పోలీసులు దృష్టి కేంద్రీకరించినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి:  Viral Video: చేప మేడలో మెరిసిన వెడ్డింగ్ రింగ్ మ్యాట‌ర్ ఏంటంటే… ( వీడియో )

Viral Video: పసిబిడ్డను ఆడించిన గొరిల్లా…!! నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో…

Kedarnath: తెరచుకుంటున్న కేదార్‌నాథ్ ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ.. ఆన్‌లైన్‌ దర్శనాలు మాత్రమే!