కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య మేడారం హుండీల కౌంటింగ్ ప్రారంభమైంది.. ఐతే మొదటిరోజు కౌంటింగ్ లోనే నకిలీ కరెన్సీ లభ్యమవడం కలకలం రేపింది. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీ ఆదాయం కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.. దేవదాయ సిబ్బంది, రెవెన్యూ, పోలీసులు, మేడారం పూజారుల సమక్షంలో ఈ కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే కౌంటింగ్ ప్రారంభమైన మొదటిరోజే ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి.. మొదట ఓపెన్ చేసిన హుండీలలో నకిలీ కరెన్సీ లభ్యమయ్యాయి.. అంబేద్కర్ ఫోటోతో ముద్రించిన నకిలీ కరెన్సీని చూసిన కౌంటింగ్ సిబ్బంది అవాక్కయ్యారు.
ఇలా ఒకటికాదు రెండుకాదు పదుల సంఖ్యలో అంబేద్కర్ ఫోటోతో ముద్రించిన వంద రూపాయల నోట్లు భారీ ఎత్తున బయటపడ్డాయి.. ప్రతి హుండీలో ఈ రకమైన నకిలీ కరెన్సీ బయటపడుతుంది.. ఇప్పటికే 20 కి పైగా నకిలీ కరెన్సీని గుర్తించి ఇవి చెల్లని నోటుగా పక్కన పెట్టారు. అయితే మేడారం జాతరలో మొత్తం 518 హుండీలు ఏర్పాటు చేయగా ఆ హండిలన్ని నిండిపోయాయి. నిండిన హుండీలను ప్రత్యేక పోలీసు భద్రత మధ్య హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో భద్రపరిచారు.. హుండీల కౌంటింగ్ ఈరోజు ఉదయం ప్రారంభమైంది సీసీ కెమెరాల పర్యవేక్షణలో దేవాదాయశాఖ అధికారులు, మేడారం పూజారుల సమక్షంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.
అయితే మొదటిరోజే ఇలాంటి ఫేక్ కరెన్సీ బయటపడటంతో కౌంటింగ్ సిబ్బంది షాక్ అయ్యారు.. ఇంకా ఇలాంటి వింతలు ఎన్ని చూడాల్సి వస్తుందో అని భావిస్తున్నారు.. గత జాతరలో కూడా కొంతమంది భక్తులు విచిత్రంగా కాగితాలలో వారి కోరికలు రాసి అమ్మవారి హుండీల్లో వేశారు.. ఈసారి ఫేక్ కరెన్సీ కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..