AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryapet: చెదిరిన బతుకులు.. కూలి పనికి వెళ్తూ.. ఆనంత లోకాలకు

పొట్టకూటి కోసం ఉదయాన్నే పనులకు వెళుతున్న కూలీలను రోడ్డు ప్రమాదం పొట్టనబెట్టుకుంది. ఆర్టీసీ బస్సు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు నలుగురిని కబళించింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వివరాలు ఇలా ఉన్నాయి...

Suryapet: చెదిరిన బతుకులు.. కూలి పనికి వెళ్తూ.. ఆనంత లోకాలకు
Road Accident
Ram Naramaneni
|

Updated on: Feb 29, 2024 | 12:29 PM

Share

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా సూర్యాపేట-ఖమ్మం హైవేపై బుధవారం ఆటోను బస్సు ఢీకొనడంతో ఐదుగురు వ్యవసాయ కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 9 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 15 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో రిక్షాను అండర్‌పాస్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మునగాల మండలం రామసముద్రం గ్రామానికి చెందిన కూలీలు మోతె మండలం బుర్కచెర్ల గ్రామంలో పొలాల్లో పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

ప్రమాదంలో  ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా, గాయపడిన వారిలో ఇద్దరు మృతి చెందారు. మృతులు నాగమ్మ (50), నారాయణమ్మ (55), అనసూయమ్మ (70), సౌభాగ్యమ్మ(58), కందుల గురువయ్య(63)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు మధిర డిపోకు చెందినదిగా గుర్తించారు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

మృతుల కుటుంబాలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వాస్పత్రిలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాహుల్ హెగ్డే, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పరామర్శించారు. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి