Fraud Case: ఒకే గ్రామంలో 200 మంది బకరా అయ్యారు.. మ్యాటర్ తెలిస్తే మీటర్ ఎగిరిపోవడం ఖాయం..

Fraud Case: డబ్బులు ఫ్రీగా రావని ఎంత చెప్పినా వినలేదు. సైబర్‌ ఉచ్చులో పడొద్దంటే చెవికెక్కలేదు. ఆఖరికి సైబర్‌ నేరగాళ్లకు కాసులు కురిపించి బలయ్యారు ఆ గ్రామప్రజలు.

Fraud Case: ఒకే గ్రామంలో 200 మంది బకరా అయ్యారు.. మ్యాటర్ తెలిస్తే మీటర్ ఎగిరిపోవడం ఖాయం..
Cyber Crime

Edited By:

Updated on: Jan 05, 2022 | 4:29 PM

Fraud Case: డబ్బులు ఫ్రీగా రావని ఎంత చెప్పినా వినలేదు. సైబర్‌ ఉచ్చులో పడొద్దంటే చెవికెక్కలేదు. ఆఖరికి సైబర్‌ నేరగాళ్లకు కాసులు కురిపించి బలయ్యారు ఆ గ్రామప్రజలు. వివరాల్లోకెళితే.. అది వికారాబాద్ జిల్లాలోని మారుమూల పల్లె కడ్మూరు. ఆ పల్లె జనాల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్నారు సైబర్‌ నేరగాళ్లు. కడ్మూరు గ్రామ ప్రజలను నిండా ముంచి కుచ్చుటోపి పెట్టారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు దాదాపు రెండు వందల మంది అడ్డంగా మోసపోయారు. ఈ మధ్య కాలంలో తక్కువ పెట్టుబడికి ఎక్కుడ డబ్బు అంటూ కొన్ని యాప్స్‌ వస్తోన్న విషయం తెలిసిందే. ఇలాంటి యాప్‌ వలలో చిక్కి ఎంతోమంది తమ డబ్బును పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. లైమ్ కంపెనీ పేరుతో ఉన్న ఓ లింక్‌ను ఓపెన్‌ చేసిన గ్రామ యువకులు, ఆ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు.

యాప్‌లో పెట్టుబడి పెడితే డబ్బులు వస్తున్నాయని నమ్మి, 200 మంది ఇన్వెస్ట్ చేశారు. 500 రూపాయల నుంచి లక్ష వరకు పెట్టుబడి పెడితే రోజు ఆదాయం వస్తుండడంతో గుడ్డిగా నమ్మారు ప్రజలు. సీమ అనే మహిళ వాట్సప్ చాట్ ద్వారా పెట్టుబడి పెట్టించినట్టు చెబుతున్నారు బాధితులు. న్యూఇయర్ ఆఫర్ అంటూ పది వేలకు లక్ష, లక్షకు ఐదు లక్షల ఆఫర్ అంటూ ఊరించింది మహిళ. ఆ కేడీ మాటలు నమ్మి భారీగా పెట్టబుడులు పెట్టారు గ్రామస్తులు. మొదటి రోజు భారీగా ఆదాయం వచ్చింది. ఇది గమనించి లాభం వస్తుందనే అత్యాశతో అప్పుచేసి మరి లక్షలు యాప్‌లో గుమ్మరించేశారు. ఆ తరువాత ఆఖరికి అసలు విషయం బయటపడింది. పెట్టుబడిగా పెట్టిన డబ్బుకు ఆదాయం రావడం బంద్ అయ్యింది. ఏంటా ఆరా తీసే ప్రయత్నం చేసే.. సదరు కిలాడీ మహిళ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో తామంతా మోసపోయామని గ్రహించారు గ్రామస్తులు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. ఎలాగైనా తమ డబ్బులు తిరిగి వచ్చేలా చూడాలని బాధిత ప్రజలు పోలీసులను వేడుకుంటున్నారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Viral Video: అందమైన ‘అల్బీనో స్నేక్‌’..సొగసు చూడతరమా..!

IND vs SA: ఆఫ్రికన్ గడ్డపై బుమ్రా, శార్దుల్ విధ్వంసం.. గాయాలపాలైన సౌతాఫ్రికా బ్యాటర్లు..!

Sara Ali Khan : లవ్‌ అంటూ ఇద్దరిని ముంచావ్‌.. ఇప్పుడు మూడో వాడు అలా ఉండాలా..(Video)