Telangana: ప్రియుడిని ఇంటికి పిలిచి ప్రాణం తీసిన ప్రియురాలు.. పక్కా ప్లాన్‌తో..

వివాహేతర సంబంధాలు ఎన్నో అనర్థాలకు దారి తీస్తున్నాయి.. కుటుంబాల్లో అల్లకల్లోలం సృష్టించడంతోపాటు.. ప్రాణాలు కూడా తీస్తున్నాయి. తాజాగా ఓ అక్రమ సంబంధం యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. వివాహేతర సంబంధం బయట పడడంతో ప్రియురాలు ప్రియుడిని పిలిచి ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: ప్రియుడిని ఇంటికి పిలిచి ప్రాణం తీసిన ప్రియురాలు.. పక్కా ప్లాన్‌తో..
Crime News

Edited By: Shaik Madar Saheb

Updated on: Jun 22, 2025 | 11:28 AM

నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం నోముల గ్రామానికి చెందిన జానయ్య అనే యువకుడు అదే గ్రామానికి చెందిన వివాహితతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివాహితతో పదేళ్లుగా వివాహేతర సంబంధంపై గ్రామ పెద్దలు, పోలీసుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ కూడా జరిగింది. పలుమార్లు మహిళ కుటుంబ సభ్యులు జానయ్యను మందలించారు. అయినా జానయ్య ప్రవర్తనలో మార్పు లేకపోగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తునే ఉన్నాడు. యువకుడి బలహీనతను ఆసరాగా చేసుకొని వివాహిత.. పెద్ద మొత్తంలో డబ్బు, ఇంటి స్థలం ఇవ్వాలని ఒత్తిడి చేసింది..

అయితే.. జానయ్య నిరాకరించడంతో ఆ మహిళ యువకుడిని ట్రాప్ చేసేందుకు పథకం వేసింది. జానయ్యకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది.. దీంతో జానయ్య ఆమె ఇంటికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న ఆమె భర్త, కుటుంబసభ్యులు జానయ్యను తీవ్రంగా కొట్టారు. పారిపోతున్న జానయ్యను వెంబడించి పట్టుకున్నారు. చీర, తాడుతో జానయ్యను చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు.

అనంతరం స్థానికులు తీవ్రంగా గాయపడిన జానయ్యను నలగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అయితే.. జానయ్య నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పథకం ప్రకారమే దాడి చేసి హత్య చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..