ఈ ఐస్ క్రీములు తిన్నారంటే మీ పిల్లలు మత్తులోకి జారుకోవాల్సిందే..! తస్మాత్ జాగ్రత్త!

మీ పిల్లలకు ఐస్ క్రీములు ఇప్పిస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త! పిల్లలు మారం చేస్తున్నారని ఏడుస్తున్నారని, వారిని బుజ్జగించడం కోసం ఈ ఐస్ క్రీం ఇచ్చారా..? మీ పిల్లలు మత్తులోకి జారుకొక తప్పదు. అంతేకాకుండా మీరు ఇచ్చేది నాణ్యమైన కల్తీ లేని ఐస్ క్రీమ్ అనుకుంటే పొరపాటే!

ఈ ఐస్ క్రీములు తిన్నారంటే మీ పిల్లలు మత్తులోకి జారుకోవాల్సిందే..! తస్మాత్ జాగ్రత్త!
Whiskey Ice Cream
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 06, 2024 | 11:40 AM

మీ పిల్లలకు ఐస్ క్రీములు ఇప్పిస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త! పిల్లలు మారం చేస్తున్నారని ఏడుస్తున్నారని, వారిని బుజ్జగించడం కోసం ఈ ఐస్ క్రీం ఇచ్చారా..? మీ పిల్లలు మత్తులోకి జారుకొక తప్పదు. అంతేకాకుండా మీరు ఇచ్చేది నాణ్యమైన కల్తీ లేని ఐస్ క్రీమ్ అనుకుంటే పొరపాటే! కానీ ఇది కల్తీ కన్నా అతి డేంజరస్ ఐస్ క్రీమ్స్. వాటి పేరే విస్కీ ఐస్ క్రీమ్స్. అవును మీరు విన్నది నిజమే ఈ ఐస్ క్రీమ్స్ మీ పిల్లలకి ఇప్పిచ్చారా అంతే సంగతి..!

చిన్నపిల్లలు ఎంత ఇష్టపడే ఐస్ క్రీమ్‌లను కొందరు వ్యక్తులు క్యాష్ చేసుకుంటున్నారు. ఏకంగా తినే ఐస్ క్రీమ్‌లలో విస్కీని కలిపి విక్రయాలు జరుపుతున్నారు. ఇలా విక్రయాలు జరుపుతున్న ఐస్ క్రీమ్ పార్లర్‌పై ఎక్సైజ్ అండ్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు చేశారు ఏకంగా 100 ఫైపర్ విస్కీ కలిపి విపరీతమైన ధరలతో అమ్మకాలు జరుపుకుంటున్నట్లు గుర్తించారు. కొంతమంది ఐస్ క్రీమ్ పార్లర్‌కు సంబంధించి పక్కా సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 లోని హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్‌పై దాడి చేశారు. శరత్ చంద్రారెడ్డి అనే వ్యకతి జోరుగా విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు కొనసాగిస్తున్నారని గుర్తించారు. తనిఖీల్లో భారీ విస్కీ ఐస్ క్రీమ్ బయటపడింది.

ఒక కేజీ ఐస్ క్రీమ్ లో 60 ఎంఎల్ 100 పైపర్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఫేస్‌బుక్ ద్వారా ఈ పార్లర్ ప్రకటనలు ఇచ్చి అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా ఆఫ్ కేజీ విస్కీ ఐస్ క్రీమ్‌లను 23 పీసులను, 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీములను ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ బృందం స్వాధీనం చేసుకుంది. విస్కీ ఐస్ క్రీమ్‌ తయారీ వెనుక దయాకర్ రెడ్డి, శోభన్ అనే వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విస్కీ ఐస్ క్రీమ్ నెట్‌వర్క్‌పై ఆరా తీస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..