Wildlife Sanctuary: విరిగిపడ్డ వేలాది చెట్లు.. వాటితో అటవీ శాఖకు లాభం ఎంత..? నష్టం ఎంత..?

ఎన్నడూ కనివిని ఎరుగని విపత్తు అటవీశాఖను కోలుకొని దెబ్బతీసింది. కొండ కోనల్లో పచ్చటి చెట్ల మధ్య స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు ప్రాణ భయంతో భీతిల్లేలా చేసింది. సునామీలా విరుచుకుపడిన రాకాసి గాలి కారడవిని మొత్తం తుడిచి పెట్టుకుపోయేలా చేసింది. ప్రమాదం తర్వాత అటవీశాఖ అసలేం జరిగింది..? అనే వివరాలు తెల్చే పనిలో వివిధ కోణాల్లో విచారణ చేపట్టింది.

Wildlife Sanctuary: విరిగిపడ్డ వేలాది చెట్లు.. వాటితో అటవీ శాఖకు లాభం ఎంత..? నష్టం ఎంత..?
Eturunagaram Wildlife Sanctuary
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 06, 2024 | 9:40 AM

ములుగు జిల్లా మేడారం తాడ్వాయి మధ్య అభయారణ్యంలో ప్రకృతి బీభత్సం పై అటవీ శాఖ ఎటు తేల్చలేక పోతోంది. నీలమట్టమైనా చెట్ల లెక్కలు తేల్చే పనిలో పడింది. అటవీ శాఖ చరిత్రలోనే ఎప్పుడు కనివిని ఎరుగని బీభత్సం అభయారణ్యాన్ని తుడిచి పెట్టుకుపోయేలా చేసింది. విలువైన వృక్ష సంపద నేలమట్టం అయ్యింది. ఈ విపత్తుకు కారణాలపై అటవీశాఖ అన్ని కోణాల్లో విచారణ జరుపుతుంది. ఒకవైపు మెట్రోలాజికల్, శాటిలైట్ డేటా ఆధారంగా ఏం జరిగిందో వివరాలు సేకరిస్తున్నారు నిపుణులు. మరోవైపు వాతావరణశాఖ, జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల ద్వారా విచారణ జరుపుతున్నారు.

ఎన్నడూ కనివిని ఎరుగని విపత్తు అటవీశాఖను కోలుకొని దెబ్బతీసింది. కొండ కోనల్లో పచ్చటి చెట్ల మధ్య స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు ప్రాణ భయంతో భీతిల్లేలా చేసింది. సునామీలా విరుచుకుపడిన రాకాసి గాలి కారడవిని మొత్తం తుడిచి పెట్టుకుపోయేలా చేసింది. ప్రమాదం తర్వాత అటవీశాఖ అసలేం జరిగింది..? అనే వివరాలు తెల్చే పనిలో వివిధ కోణాల్లో విచారణ చేపట్టింది.

విపత్తు జరిగిన ప్రాంతాన్ని పీసీసీఎఫ్ రాకేష్ డోబ్రియల్, అటవీశాఖ ఉన్నతాధికారులు, టెక్నికల్ టీం పరిశీలించారు.. మెట్రోలాజికల్, శాటిలైట్ డేటా ఆధారంగా ఆ రోజు ఏం జరిగింది..? ఎన్ని నిమిషాల పాటు రాకాసి గాలి ఈ అడవిలో బీభత్సం సృష్టించింది..? చెట్లు గాలిలో ఎంతసేపు.. ఎన్ని మీటర్ల ఎత్తు ఎగిరి పడ్డాయి..? అనే వివరాలు సేకరిస్తున్నారు. మరో వైపు నేలమట్టమైన భారీ వృక్షాలు, ఓ మోస్తారు చెట్ల లెక్కలు తేల్చేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఒక్కో టీంలో 30 మంది సిబ్బంది చొప్పున పది బృందాలతో అటవీశాఖ విచారణ చేస్తుంది. చెట్ల లెక్కలు, కొలతలు సేకరిస్తున్నారు.

వీడియో చూడండి..

204 హెక్టార్లలో 70 వేలకు పైగా భారీ వృక్షాలు నేలమట్టం అయినట్లు ప్రాథమిక అంచనా చేశారు. వేర్లతో సహా 50 నుండి 60 రకాల వృక్ష సంపద నేలమట్టం అయినట్లు గుర్తించారు. వాటిలో టేకు, నల్లమద్ది, జిట్రేగి, బూరుగు, ఎర్రమద్ది, బొజ్జ, మారేడు, తెల్లమద్ది, నేరేడుతోపాటు వివిధ రకాల విలువైన వృక్షాలు నేలమట్టం అయ్యాయి. అత్యంత విలువైన వృక్ష సంపద తుడిచి పెట్టుకుపోవడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాతావరణశాఖ, జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల ద్వారా విచారణ జరుపుతున్న అటవీశాఖ.. మరోవైపు మెట్రోలాజికల్, శాటిలైట్ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. మరో వైపు అటవీశాఖ టెక్నికల్ టీం అన్ని కోణాల్లో విచారణ జరుపుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
చంద్రబాబు సర్కార్‌కు 100 రోజులు.. ఇవాళ కేబినెట్ కీలక భేటీ..
చంద్రబాబు సర్కార్‌కు 100 రోజులు.. ఇవాళ కేబినెట్ కీలక భేటీ..
మయన్మార్‌లో యాగీ బీభత్సం.. 21టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ పంపిన భారత్
మయన్మార్‌లో యాగీ బీభత్సం.. 21టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ పంపిన భారత్
10th పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. విద్యార్ధుల్లో అయోమయం
10th పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. విద్యార్ధుల్లో అయోమయం
దసరా నవరాత్రులకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి..
దసరా నవరాత్రులకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి..
12 మ్యాచ్‌ల్లో 499 పరుగులు.. కట్‌చేస్తే.. ఢిల్లీ డైనమేట్‌పై కన్ను
12 మ్యాచ్‌ల్లో 499 పరుగులు.. కట్‌చేస్తే.. ఢిల్లీ డైనమేట్‌పై కన్ను
రేపట్నుంచి 'ఏపీ టెట్‌ 2024' ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌లు..
రేపట్నుంచి 'ఏపీ టెట్‌ 2024' ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌లు..