AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీళ్ళందరిని తెలంగాణ లోకల్ గానే పరిగణించండి.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

మెడికల్ సీట్ల స్థానికత వివాదానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అభ్యర్థుల స్థానికతకు సంబంధించిన ప్రతి రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33 ను పలువురు తెలంగాణ విద్యార్థులు హైకోర్టులో ఆపిల్ చేశారు.

వీళ్ళందరిని తెలంగాణ లోకల్ గానే పరిగణించండి.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Medical Admissions
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Sep 06, 2024 | 10:52 AM

Share

మెడికల్ సీట్ల స్థానికత వివాదానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అభ్యర్థుల స్థానికతకు సంబంధించిన ప్రతి రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33 ను పలువురు తెలంగాణ విద్యార్థులు హైకోర్టులో ఆపిల్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33 ప్రకారం నీట్ పరీక్షకు ముందు నాలుగు సంవత్సరాలు పాటు తెలంగాణలోని చదువుకుండలి అనే నిబంధనను విధించారు. దీని ద్వారా తెలంగాణ స్థానికత ఉన్నప్పటికీ ఇంటర్మీడియట్ ఇతర ప్రాంతంలో చదివి ఉంటే వీరు నాన్ లోకల్ గా పరిగణించబడతారు..

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోను సవాల్ చేస్తూ 100 మందికి పైగా అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో ఆపిల్ చేశారు. తమకు తెలంగాణ స్థానికత ఉన్నప్పటికీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో కారణంగా తాము నాన్ లోకల్ గా పరిగణించబడుతున్నామని కోర్టులను ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున వాదనలు విన్న హైకోర్టు వీరందరినీ తెలంగాణ స్థానికులుగానే పరిగణించాలని ఆదేశాలు జారీ చేసింది. వీరితోపాటు గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33 లోని మార్గదర్శకాల పైనా హైకోర్టు కీలక వాక్యాలు చేసింది.

ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోలో మార్గదర్శకాలు సరైన పద్ధతిలో లేవని హైకోర్టు అభిప్రాయబడింది. ఎందుకోసం మరోసారి మార్గదర్శకాలను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వందమందికి పైగా విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పుడు వీరందరూ తెలంగాణలోకల్సే గానే పరిగణిస్తారు. తెలంగాణ ప్రభుత్వం 85% లోకల్ క్యాటగిరి లోనే వీరికి అడ్మిషన్లు లభించనున్నాయి.

అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33 ప్రకారం నీటి పరీక్షకు నాలుగు సంవత్సరాలు తెలంగాణలోని చదివి ఉండాలి అనే నిబంధనను తీసుకొచ్చింది. 9, 10 తరగతిలో పాటు ఇంటర్ రెండు సంవత్సరాలు తెలంగాణలోనే చదివి ఉంటే వీరికి తెలంగాణ లోకల్‌గా పరిగణిస్తారు. అయితే చాలామంది విద్యార్థులు 9, 10 తరగతులు తెలంగాణలో చదువుకున్నప్పటికీ ఇంటర్మీడియట్ ఇతర ప్రాంతాల్లో చదివారు. అలా చదివిన వారందరూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33 ప్రకారం నాన్ లోకల్ గా పరిగణించాలని పేర్కొంది. దీనిని సవాలు చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించటంతో స్థానిక కలిగి నాలుగు సంవత్సరాలు తెలంగాణలో చదువుకోనప్పటికీ కూడా వీరికి తెలంగాణ స్థానికత ఇవ్వాల్సిందిగా హైకోర్టు స్పష్టం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..