
మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కన్నుమూశారు. 85 ఏళ్ల వయస్సులో ఆయన అనారోగ్యంతో చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విజయరామారావు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విజయరామారావు వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారంలో జన్మించారు. డు. 1959 అక్టోబరు లో టికి ఐ.పి.ఎస్. ట్రైనీగా శిక్షణ పొందిన తరువాత చిత్తూరు ఏ.ఎస్పీ.గా ఉద్యోగంలో చేరారు. .1984 టీడీపీ ఆగస్టు సంక్షోభం సమయంలో ఆయన హైదరాబాద్ కమిషనర్‌గా పనిచేశారు. సీబీఐ డైరెక్టర్‌గా హవాలా కుంభకోణం, బాబ్రీమసీదు విధ్వంసం, ఇస్రో గూఢచర్యం కేసు,ముంబై బాంబు పేలుళ్లు.మొదలైన కేసులు దర్యాప్తు చేశారు. 1999 అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ తరపున ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పి.జనార్థనరెడ్డి పై విజయం సాధించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి దానం నాగేందర్ చేతిలో ఓడిపోయారు.
కాగా.. మాజీ మంత్రి కె.విజయరామారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సిఎం కేసీఆర్ తన సంతాపాన్ని ప్రకటించారు. ప్రభుత్వ అధికారిగా, ప్రజా ప్రతినిధిగా విజయరామారావు అందించిన ప్రజా సేవలు గొప్పవని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనంతరం తెలంగాణ రాష్ట్రంలో విజయరామారావుతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దివంగతులైన మాజీ మంత్రి విజయరామారావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..