
కవితకు నేను టార్గెట్ అయ్యానని అనుకోవట్లేదు.. తన వ్యాఖ్యలకు కవిత చింతించి ఉంటారని అనుకుంటున్నా.. ఆమె గురించి కేసీఆర్‌తో ఎప్పుడూ చర్చించలేదు.. పార్టీలో ఇబ్బంది ఉంటే, మేమే చూసుకుంటాం.. అంటూ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. 25ఏళ్లలో తానెవర్నీ వ్యక్తిగతంగా దూషించలేదని.. KCRపై ఆఫ్ ది రికార్డ్ విమర్శలు చేసినా తట్టుకోలేను.. అంటూ వ్యాఖ్యానించారు. టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాట్లాడిన మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అనవసర పరిచయాలకు తాను దూరమని.. కేసీఆర్‌కు నేను దగ్గరగా ఉండటమే కొందరిలో ఈర్ష్యకు కారణం అంటూ జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.
కవిత ఎపిసోడ్‌తో బీఆర్‌ఎస్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని.. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సింగరేణి అనుబంధ సంఘం బాధ్యతల్ని మార్చడం సాధారణం.. కవిత జాగృతి ఎప్పటి నుంచో ఉంది, కొత్తదేం కాదు.. అంటూ పేర్కొన్నారు. జాగృతి పేరిట కవిత ఆందోళనలు చేస్తున్నారు.. కవిత విషయంలో ఏం చేయాలనేది ఆలోచిస్తామన్నారు. ఇబ్బంది అయితే తప్పకుండా కవిత గురించి ఆలోచిస్తాం అంటూ పేర్కొన్నారు. అన్ని పార్టీల్లోనూ భిన్నస్వరాలు ఉంటాయని.. కాంగ్రెస్, బీజేపీల్లోనూ గుంపులు, వర్గాలు ఉన్నాయన్నారు.
కేవలం బీఆర్‌ఎస్‌లో సమస్యలనే ఎందుకు హైలెట్ చేయాలి.. ఒకే కుటుంబంలో భిన్న పార్టీల నేతలు ఉన్నవారున్నారని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీల కుటుంబంలోనే కాంగ్రెస్, బీజేపీ నేతలున్నారని.. ఈ దేశంలో ఎవరికైనా పార్టీపెట్టే హక్కుంది అంటూ పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో KTR, కవిత మాత్రమే ఉన్నారా.. రాఖీపై అంత రాద్ధాంతమెందుకు.. రాఖీ కట్టకపోతే బ్రహ్మాండం బద్ధలైపోతుందా.. అంటూ టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.
ఫామ్‌హౌజ్ ఉందని ఎన్నికల అఫిడవిట్‌లోనే చూపించా.. నా ప్రతీసంపాదన ఐటీలో ఉంది, అఫిడవిట్‌లో ఉంది.. అంటూ జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి పవర్‌ప్లాంట్ విషయంలో.. కోమటిరెడ్డి రిపోర్టు ఎందుకు దాచారు.. మూణ్నెళ్ల క్రితం రిపోర్టు ఇస్తే ఎందుకు బయటపెట్టలేదు.. నేనే కోమటిరెడ్డిపై రివర్స్ కేసుపెడతా అంటూ పేర్కొన్నారు. ఏ విచారణ చేపట్టినా కడిగిన ముత్యంలా బయటకు వస్తామన్నారు. నల్గొండలో పార్టీ పరిస్థితికి నేనే బాధ్యుణ్ని..గుత్తా.. పొద్దు తిరుగుడు పువ్వు లాంటి నేత .. అధికారం ఎటుంటే అటు గుత్తా వెళ్లిపోతారు.. ఉద్యమం కోసమే కేసీఆర్‌తో కలిశాను.. కేసీఆర్ వల్లే ఎమ్మెల్యేనయ్యాను, మంత్రినయ్యాను అంటూ జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..