Ex Minister Etela Rajender Resignation approved: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన శాసనసభ సభ్యత్వానికి ఈరోజు ఉదయం రాజీనామా చేశారు. ఈటల రాజీనామాను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. ఈ ఉదయం గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఈటల అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల చేసిన రాజీనామాకు ఆమోదముద్ర వేసినట్లు స్పీకర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు ఈటల చుట్టూనే తిరుగుతున్నాయి. ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే, ఈటల రాజీనామా పత్రం తనకు అందిన వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ ఆమోద ముద్రవేశారు. రాజీనామా చేసిన 2 గంటల్లోనే సంతకం చేశారు. ఈ ఉదయం గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు ఈటల రాజేందర్. అనంతరం నేరుగా అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో…అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేశారు. స్పీకర్ ఫార్మట్‌లోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు ఈటల రాజేందర్ లేఖను పంపించారు. ఆ లేఖ తనకు అందించిన వెంటనే ఆమోద ముద్ర వేశారు స్పీకర్.