Telangana Elections: రాష్ట్ర వ్యాప్తంగా మొరాయిస్తున్న ఈవీఎంలు.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

| Edited By: Ravi Kiran

Nov 30, 2023 | 9:42 AM

తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకూ ప్రశాంతంగా కొననసాగుతోంది. తెలంగాణ ఎన్నికల కమిషన్ అధికారి వికాస్ రాజ్ ఎస్ఆర్ నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. డీజీపీ అంజనీ కుమార్ అంబర్ పేటలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు.

Telangana Elections: రాష్ట్ర వ్యాప్తంగా మొరాయిస్తున్న ఈవీఎంలు.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
Evms Are Not Working At Polling Centers Of Telangana Elections
Follow us on

తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకూ ప్రశాంతంగా కొననసాగుతోంది. తెలంగాణ ఎన్నికల కమిషన్ అధికారి వికాస్ రాజ్ ఎస్ఆర్ నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. డీజీపీ అంజనీ కుమార్ అంబర్ పేటలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు దాదాపు 40 నిమిషాలకు పైగా క్యూ లైన్లోనే నిలుచున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ ఈవీఎం యంత్రాలలో సాంకేతి కారణాలు తలెత్తడంతో పోలింగ్ ఆలస్యంగా జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు కేటాయించారు ఎన్నికల అధికారులు.

ఇలా సాంకేతిక సమస్యలు తలెత్తిన వెంటనే టెక్నికల్ టీంను నియమించింది ఎలక్షన్ కమిషన్. బోయిన్ పల్లి సెయింట్ పీటర్స్ స్కూల్లో ఈవీఎంలు పనిచేయలేదు. నాగర్జునసాగర్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ కాలనీ 158 పోలింగ్ బూత్‌లో ఇప్పటి వరకూ ప్రారంభం కాని పోలింగ్. నిర్మల్ బైంసాంలో కూడా ఈవీఎంలు పనిచేయడం లేదు. ఇబ్రహీంపట్నం, ఖానాపూర్‌, మెదక్, వరంగల్ జిల్లాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు.

దుబ్బాక 125వ పోలింగ్ కేంద్రంలోనూ ఈవీఎంలు పనిచేయడంలేదంటున్నారు బూత్ లెవెల్ అధికారులు. ఈవీఎం మొరాయింపుపై జాయింట్ సీఈవో పర్యవేక్షిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా పరిషత్ స్కూల్‌లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. మెదక్ జిల్లాలోని ఎల్లాపూర్‌లో ఇప్పటి వరకూ పోలింగ్ ప్రారంభం కాలేదు. అదిలాబాద్ జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయడం లేదు. నల్లొండ సాగర్ 103 పోలింగ్ కేంద్రంలో పనిచేయని ఓటింగ్ మిషన్లు.

ఇవి కూడా చదవండి

జిగిత్యాల జిల్లా భువనగిరిలో కూడా పలు పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ఓటింగ్ ప్రారంభం కాలేదు. చిలుకూరు, మునగాల, సనత్ నగర్, ఆర్మూర్ ఇలా ప్రతి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈవీఎం మిషన్లలో సాంకేతి లోపం తలెత్తింది. కేవలం సాయంత్రం 5 గంటల వరకే సమయం ఉండటంతో ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ క్రమంగా పెరుగుతోంది. దీనిపై ఎన్నికల అధికారులు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు.

పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..

పోలింగ్ లైవ్ వీడియో కోసం కింద క్లిక్ చేయండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..