ఉడుతా.. ఎంత పని చేశావే? దెబ్బకు అధికారులంతా పరుగో పరుగు..! అసలేం జరిగిందంటే..
ఒక్కోసారి మూగజీవాలు ప్రమాదకర స్థలాల్లో సంచరిస్తూ లేనిపోని తిప్పలు తెచ్చిపెడుతుంటాయి. ఆనక వాటి అమాయకత్వానికి ప్రాణాలు వదలడమే కాకుండా భౌతికంగా అపార నష్టాన్ని కలిగిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలు సాధారణంగా కోతులు, కుక్కలు, పిల్లులు, పక్షుల వల్ల తరచూ సంభవిస్తుంటాయి. అయితే తాజాగా ఓ ఉడుత అలాంటి పనే చేసింది. అసలేం జరిగిందంటే..

రఘునాథపల్లి, ఆగస్ట్ 17: ఆహారం కోసమో.. గూడు కట్టుకోవడం కోసమో తెలియదుగానీ కొన్నిసార్లు మూగజీవాలు ప్రమాదకర స్థలాల్లో సంచరిస్తూ లేనిపోని తిప్పలు తెచ్చిపెడుతుంటాయి. ఆనక వాటి అమాయకత్వానికి ప్రాణాలు వదలడమే కాకుండా భౌతికంగా అపార నష్టాన్ని కలిగిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలు సాధారణంగా కోతులు, కుక్కలు, పిల్లులు, పక్షుల వల్ల తరచూ సంభవిస్తుంటాయి. అయితే తాజాగా ఓ ఉడుత వల్ల విద్యుత్ శాఖకు లక్షల్లో నష్టం వాటిల్లింది. అంతేనా ఉతుత ప్రాణాలు కూడా పోగొట్టుకుంది. ఈ సంఘటన జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలంలో చోటు చేసుకుంది. ద్యుత్తు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెంలోని ఓ విద్యుత్తు ఉపకేంద్రంలో శనివారం (ఆగస్ట్ 16) భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఓ ఉడుత విద్యుత్తు కేంద్రంలోకి చొరబడింది. ఆ తర్వాత విద్యుత్తు యంత్రాల్లోకి పరుగులు తీసింది. దీంతో ఒక్కసారిగా కెపాసిటర్ సెల్స్ పేలిపోయి భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఛార్జింగ్ బ్యాటరీలు, కెపాసిటర్ల ప్యానల్స్, కేబుళ్లు వంటి విద్యుత్ సామగ్రి ఆ మంటల్లో కాలిపోయాయి.
వెంటనే అప్రమత్తమైన విద్యుత్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం హుటాహుటీన విద్యుత్తు సరఫరాను నిలిపివేయించారు. దీంతో ప్రమాదం తీవ్రత తగ్గింది. లేదంటే ఊహించని నష్టం జరిగేది. మంటలను అదుపు చేసి యంత్రంలో చనిపోయిన ఉడుతను లోపలి నుంచి బయటకు తీశారు. విద్యుత్‌ను పునరుద్దరించడానికి అవసరమై మరమ్మతులు చేసి విద్యుత్తు సరఫరాను తిరిగి పునరుద్ధరించారు. ప్రమాద స్థలాన్ని డిస్కం, ట్రాన్స్‌కో, ఓఎన్‌ఎం సిబ్బంది చేరుకుని, అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంలో రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు విద్యుత్ అధికారులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




