ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసుల్లో తెలిపారు.. వాస్తవానికి ఈ-రేస్ కేసులో నేడు ఈడీ విచారణకు కేటీఆర్ వెళ్లాల్సి ఉంది. అయితే కోర్టు తీర్పు ఉన్నందున నేడు విచారణకు రాలేనన్నారు కేటీఆర్.. కేటీఆర్ వినతికి ఆమోదం తెలిపిన ఈడీ.. ఈనెల 16 విచారణకు రావాలని మళ్లీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఇదే కేసులో రేపు విచారణకు రావాలని BLN రెడ్డికి.. ఎల్లుండి విచారణకురావాలని అరవింద్‌కు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు..
ఇదిలాఉంటే.. ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. అరెస్ట్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు కేటీఆర్.. అయితే, కేటీఆర్ కంటే ముందే సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం.. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే..కేసులో తమ వాదనలు కూడా వినాలంటూ ప్రభుత్వం తన పిటిషన్‌లో కోరింది. తాజా పరిణామాలతో ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకుంది.
తాజా పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.. క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత తొలిసారి ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు.
‘‘నా మాటలు రాసిపెట్టుకోండి.. ఎదురు దెబ్బల నుంచి బలంగా తిరిగొస్తా.. మీ అబద్ధాలు నా గొంతు నొక్కలేవు.. మీ చర్యలు నా లక్ష్యాన్ని అడ్డుకోలేవు .. మీ తాటాకు చప్పుళ్లకు నేను బెదరను.. ఆలస్యంగానైనా నిజాలు నిగ్గుతేలుతాయి.. న్యాయవ్యవస్థను గౌరవిస్తా.. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది.. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది..’’ అంటూ.. కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Mark my words, Our comeback will be stronger than this setback
Your lies won’t shatter me
Your words won’t diminish me
Your actions won’t obscure my vision
This cacophony won’t silence me!Today’s obstacles will give way to tomorrow’s triumph.
Truth will shine brighter with…
— KTR (@KTRBRS) January 7, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..