విద్యుత్‌ షాక్‌తో చేపలు పడుతున్న మత్స్యకారులు.. పెను ప్రమాదమని హెచ్చరిస్తోన్న అధికారులు

|

Jan 24, 2021 | 2:56 PM

మహబూబబాద్ జిల్లా గూడూరులో వలలతో కాకుండా విద్యుత్ షాక్‌తో చేపలను పడుతున్నారు. గూడూరు శివారులోని పాఖాల వాగు ప్రవాహంలో  చేపల వేటకోసం మత్స్యకారులు ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

విద్యుత్‌ షాక్‌తో చేపలు పడుతున్న మత్స్యకారులు.. పెను ప్రమాదమని హెచ్చరిస్తోన్న అధికారులు
Follow us on

మహబూబబాద్ జిల్లా గూడూరులో వలలతో కాకుండా విద్యుత్ షాక్‌తో చేపలను పడుతున్నారు. గూడూరు శివారులోని పాఖాల వాగు ప్రవాహంలో  చేపల వేటకోసం మత్స్యకారులు ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కరెంట్ వైర్లలో, విద్యుత్ ప్రసరిస్తుండగా నీటిలో షాక్ ఇస్తున్నారు. కరెంట్ షాక్ తగిలిన చేపలు చనిపోయి లేదా అస్వస్థతకు గురై ఒడ్డుకు తేలుతున్నాయి. చనిపోయిన చేపలను మత్స్యకారులు ఇళ్లకు తీసుకువెళ్తున్నారు. కరెంట్ ఫ్లస్ వాటర్ ఎంత డేంజరస్ కాంబినేషన్‌నో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విధానంలో మత్స్యకారుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. అవగాహనలోపంతోనే కరెంట్ వైర్లతో చేపలు పడుతూ గతంలో ఇద్దరు చనిపోయినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.

కరెంట్ షాక్‌తో చేపలు పడుతున్న విషయం తెలుసుకున్న స్థానిక ఏఈ పోలీసులకు ఫిర్యాదు చేసి, మత్స్యకారులకు కౌన్సిలింగ్ ఇప్పించాడు. మత్స్యకారులు విద్యుత్ వైర్లతో చేపలు పట్టినట్లు తమ దృష్టికి వస్తే, శాఖాపరమైన చర్యలు తీసుకుని, కేసులు నమోదు చేస్తామని ఏఈ చిరంజీవి హెచ్చరించాడు.

Also Read:

సీఎం జగన్ ఇంటికి వెళ్లే రోడ్డు వెంబడి గోడలపై చంద్రబాబుకు వ్యతిరేకంగా రాతలు.. ఆరా తీస్తున్న పోలీసులు

Maleesha Kharwa: ‘ప్రిన్సెస్ ప్రమ్ ద స్లమ్’.. మట్టిలోని మాణిక్యం ఈ మలీషా.. ఇప్పుడు ఇంటర్నేషనల్ సెలబ్రిటీ