Munugode Bypoll: మునుగోడులో దూకుడు పెంచిన ఈసీ.. కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్..

|

Oct 22, 2022 | 10:16 PM

మునుగోడులో ఈసీ దూకుడు పెంచింది. డబ్బు-మద్యం పంపిణీ చేసేవారిపై కొరడా ఝులిపిస్తోంది. సింబల్‌ గోల్‌మాల్‌లో తప్పుచేసిన అధికారులపై చర్యలు చేపట్టింది.

Munugode Bypoll: మునుగోడులో దూకుడు పెంచిన ఈసీ.. కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్..
Telangana Ceo
Follow us on

మునుగోడులో ఈసీ దూకుడు పెంచింది. డబ్బు-మద్యం పంపిణీ చేసేవారిపై కొరడా ఝులిపిస్తోంది. సింబల్‌ గోల్‌మాల్‌లో తప్పుచేసిన అధికారులపై చర్యలు చేపట్టింది. అవును, మునుగోడు బైపోల్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. చండూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో సీఈసీ వికాస్‌రాజ్‌ ఎన్నికల అధికారులతో సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్స్‌, ఇతర ఎన్నికల అధికారులతో రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. మునుగోడులో ఎన్నికల నిర్వహణ, ఈవీఎంలు, స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేయడంపై చర్చించారు. దాంతోపాటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా, డబ్బు-మద్యం పంపిణీ జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఎవరైనా ప్రలోభాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

మునుగోడులో తమకు అపవాదు రాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దూకుడుగా ముందుకెళ్తోంది. సింబల్‌ గోల్‌మాల్‌లో అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌. మొన్న యుగతులసి రోడ్‌రోలర్‌ గందరగోళం విషయంలో ఆర్వోను సస్పెండ్‌ కాగా.. నిన్న పడవ గుర్తు స్థానంలో మనిషిని పోలిన గుర్తు రావడంపై చండూర్‌ తహసీల్దార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

ఇక తాజాగా షిప్పు గుర్తు స్థానంలో పడవ గుర్తును ఇవ్వడంపై సీరియస్‌ అయ్యింది. వారిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు సీఈసీ వికాస్‌రాజ్‌. మొత్తానికి మునుగోడులో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ కఠినచర్యలు చేపట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..