వామ్మో ఇదో కొత్త తరహా మోసం! ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్తే… ఆరునెలల పెన్షన్ నొక్కేశారు..

ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని వచ్చాక పెన్షన్ డబ్బులు తీసుకుందామని బ్యాంక్ వెళ్లిన మూసలవిడ షాక్ కి గురి అయ్యింది..తాను ఆసుపత్రిలో చికిత్స కోసం జైన్ అయితే తనకు రావాల్సిన ఆరునెలల పెన్షన్ ను వేరే వాళ్ళు తీసుకొని పోయారు.. దీంతో బాధితురాలు బుధవారం బ్యాంకు ముందు ముందు బైఠాయించి నిరసన తెలిపింది..తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది.. వివరాల్లోకి వెళ్తే...

వామ్మో ఇదో కొత్త తరహా మోసం! ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్తే... ఆరునెలల పెన్షన్ నొక్కేశారు..
Elderly Woman's Pension Stolen

Edited By: Jyothi Gadda

Updated on: Feb 19, 2025 | 9:54 PM

ఆరు నెలలుగా ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటున్నా ఒక వృద్ధురాలి ఫోటో మార్చి గుర్తుతెలియని దుండగులు బ్యాంకులో పెన్షన్ డబ్బులు తీసుకెళ్లిన ఘటన మాసాయిపేట మండలంలో చోటుచేసుకుంది…మసాయిపేట గ్రామానికి చెందిన శేషు పెంటమ్మ గత కొన్ని రోజులుగా గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటుంది. ఇదే క్రమంలో కొందరు వ్యక్తులు ఆమె పెన్షన్ బుక్కుపై ఫోటో మార్చి ప్రతినెల పెన్షన్ తీసుకెళ్లినట్టు ఆరోపిస్తుంది.

ఈనెల పెన్షన్ కోసం రావడంతో అవినీతి అంశం బయటపడింది. దీంతో బ్యాంక్ అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. బుధవారం బ్యాంకు ముందు ముందు బైఠాయించి నిరసన తెలిపింది..తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ ని సంప్రదించడంతో ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

అయితే బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తనకు అన్యాయం జరిగిందని శేషు పెంటమ్మ ఆరోపిస్తున్నారు ఉన్నతాధికారులు బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..