Telangana: కోకాపేట్ తరహా లాంటి బుద్వేల్ భూముల వేలంపై హైకోర్టులో పిల్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ
రాజేంద్ర నగర్ లోని బుద్వేల్లో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 100 ఎకరాల్లో 14 భారీ ప్లాట్లను హెచ్ఎండిఏ అభివృద్ధి చేసింది. ఎకరం భూమి కనీస నిర్దేశిత ధర 20 కోట్లుగా నిర్ణయించింది. ఈ లెక్కన 100 ఏకరాలకు 2000 కోట్లు అవుతుంది. అవి రెట్టింపు ధరలు పలికినా.. 4వేల కోట్ల రూపాయల భారీ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరనుంది. కోకపేట తరహాలో అప్ సెట్ ప్రైస్ కంటే మూడింతలు ధర పలికితే.., ఆదాయం 5 వేల కోట్లకు చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఓ వైపు వేలం జోరు.. మరోవైపు కోర్టు కేసులతో పోరు.. అయినా తగ్గేదేలే అంటుంది హెచ్ఎండిఏ. బుద్వేల్ భూముల వేలంపై కోర్టులో పిల్ దాఖలు కాగా… మూడు జిల్లాల్లో భూముల వేలానికి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం జరగాల్సిన బుద్వేల్ భూముల వేలం స్పస్పెన్స్ లో పడగా.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వస్తే తప్ప వేలం పాట ఆగే సూచనలు లేవు. కోకాపేట్ తరహాలోనే వందల కోట్లు విలువచేసే భూమి కోసం బడా కంపెనీలు కాసుకొని కుర్చున్నాయి. కోకాపేట తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా అత్యంత విలువైన బుద్వేల్ భూముల వేలానికి ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. కానీ చివరి నిముషంలో ఈ భూముల వేలాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు కావడంతో ఈ వేలం పై సస్పెన్స్ నెలకొంది.
రాజేంద్ర నగర్ లోని బుద్వేల్లో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 100 ఎకరాల్లో 14 భారీ ప్లాట్లను హెచ్ఎండిఏ అభివృద్ధి చేసింది. ఎకరం భూమి కనీస నిర్దేశిత ధర 20 కోట్లుగా నిర్ణయించింది. ఈ లెక్కన 100 ఏకరాలకు 2000 కోట్లు అవుతుంది. అవి రెట్టింపు ధరలు పలికినా.. 4వేల కోట్ల రూపాయల భారీ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరనుంది. కోకపేట తరహాలో అప్ సెట్ ప్రైస్ కంటే మూడింతలు ధర పలికితే.., ఆదాయం 5 వేల కోట్లకు చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు. బుద్వేల్ భూముల వివాదంలో హైకోర్టు బార్ అసోసియేషన్ ఆ ల్యాండ్ ను హైకోర్టు నిర్మాణానికి కేటాయించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు గతంలో ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిపినట్లు బార్ అసోసియేషన్ చెబుతుంది. 100 ఏకరాలను హైకోర్టు భవనాల కోసం కేటాయించేలా ప్రస్తుత వేలాన్ని ఆపాలంటూ బార్ అసోసియేషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై బుధవారం కోర్టులో లిస్టింగ్ కానీ, ప్రస్తావన కానీ రాలేదు. వేలం జరిగే గురువారం రోజు ఉదయమే ప్రస్తావన వస్తే కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ బిడ్డర్లలో నెలకొంది. ORRను ఆనుకోని రాజేంద్ర నగర్ మెయిన్ రోడ్డుకు ఉన్న బుద్వేల్ ల్యాండ్స్ ను వేలంలో దక్కించుకునేందుకు వివిధ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అంతే కాకుండా ఎయిర్ పోర్టు మెట్రో ఎక్స్ ప్రెస్ ఆ మార్గంలో వస్తుండటం బుద్వేల్ ప్రైమ్ ఏరియాగా మారింది. పక్కనే జంట జలాశయాలు ఉండటం కూడా ఈ లే అవుట్ కు మంచి డిమాండ్ వచ్చేందుకు కారణం అవుతుంది.
ఇక ఇదిలా ఉంటే మూడు జిల్లాల్లో భూముల వేలానికి తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది హెచ్ఎండిఏ. రంగారెడ్డి, సంగారెడ్డి., మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలో 26 ల్యాండ్ పార్సిల్స్ ను వేలం వేయాలని నిర్ణయించింది. రంగారెడ్డిలో 8 ప్లాట్లు, మెడ్చెల్ లో 8 ప్లాట్లు, సంగారెడ్డిలో 10 ఒపెన్ ప్లాట్లను హెచ్ఎండిఏ రెడీ చేసింది. ఈ ప్లాట్ల వేలంలో పాల్గొనేందుకు ఈ నెల 16 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఆగస్టు 18న రెండు సెషన్స్ లో ఆన్ లైన్ వేలం జరుగనుంది. ఈ మూడు జిల్లాల్లో 300 చదరపు గజాల చిన్న ప్లాట్ నుండి 8,590 చదరపు గజాల పెద్ద ప్లాట్ల వరకు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో ఏరియాను బట్టి అప్ సెట్ ప్రైస్ నిర్ణయించారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని నల్లగండ్ల ప్లాట్లకు చదరపు గజానికి 65 వేల రూపాయల అప్ సెట్ ప్రైస్ నిర్ణయించారు. కనిష్ఠంగా సంగారెడ్డిలో 12 వేల రూపాయలు చదరపు గజానికి అప్ సెట్ ప్రైస్ నిర్ణయించారు.




గతంలో కోర్టు కేసుల కారణంగా బోడుప్పల్ భూముల వేలం రద్దు అయ్యింది. బోడుప్పల్ లో రైతుల నుండి సేకరించిన భూములను డెవలప్ చేసి విక్రయించేందుకు హెచ్ఎండిఏ రెడీ కాగా కొంత మంది కోర్టులో కేసు వేయడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు బుద్వేల్ లోని ప్రభుత్వ భూములకు గతంలో హైకోర్టు కోసం కేటాయిస్తామన్న వాదనతో బార్ అసోసియేషన్ కోర్టుకు వెళ్లింది. దీంతో బుద్వేల్ భూముల వేలంపై కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.