ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11.00 గంటలకు ప్రారంభించిన విచారణ రాత్రి 8 గంటల వరకు సాగింది. ఏకంగా 9 గంటల పాటు విచారణ జరిగింది. కవిత తన సొంత వాహనంలో ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. ఈడీ ఆఫీస్‌లోకి వెళ్లే సమయంలో ఎలాగైతే చిరునవ్వుతో వెళ్లారో బయటకు కూడా అలాగే వచ్చారు కవిత. ఇదిలా ఉంటే ఇన్ని గంటలపాటు కవితను ఏం విచారించదాన్నిపై సర్వత్ర ఆసక్తినెలకొంది.
ఇదిలా ఉంటే మరోసారి విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు తెలిపినట్లు సమాచారం. ఈ నెల 16వ తేదీన కవితను మరోసారి విచారించనున్నట్లు తెలుస్తోంది. విచారణ ముగిసిన అనంతరం ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కవిత.. తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఇక విచారణలో భాగంగా జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో పీఎంఎల్‌ఏ50(2) ప్రకారం అనుమానితురాలిగా ఈడీ అధికారులు కవిత స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్టు సమచారం.
కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, విజయ్ నాయర్, మనీష్ సిసోదియా స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించింది. అరుణ్ పిళ్లైతో కలిపి కవితను విచారించారు. ఆధారాలు ధ్వంసం చేయడం, డిజిటల్ ఆధారాలు లభించకుండా చేయడం, హైదరాబాద్‌లో జరిగిన సమావేశాలపై ప్రధానంగా ఈడీ ఆరా తీసినట్టు తెలుస్తోంది. కేజ్రీవాల్, సిసోడియాతో జరిగిన భేటీలపై కూడా ప్రశ్నించినట్టు సమాచారం.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..