MLC Kavitha: వీరుని కుమార్తె ఎప్పటికీ భయపడదు.. ఎమ్మెల్సీ కవిత ఇంటివద్ద పోస్టర్లు కలకలం..

|

Dec 10, 2022 | 4:27 PM

తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు రేపు (ఆదివారం) విచారించనున్నారు. ఈ క్రమంలో ఆమె ఇంటి వద్ద కొన్ని పోస్టర్లు వెలిశాయి....

MLC Kavitha: వీరుని కుమార్తె ఎప్పటికీ భయపడదు.. ఎమ్మెల్సీ కవిత ఇంటివద్ద పోస్టర్లు కలకలం..
Mlc Kavitha
Follow us on

తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు రేపు (ఆదివారం) విచారించనున్నారు. ఈ క్రమంలో ఆమె ఇంటి వద్ద కొన్ని పోస్టర్లు వెలిశాయి. వీరుని కుమార్తె ఎప్పటికీ భయపడదు అనే క్యాప్షన్ తో వెలసిన బ్యానర్లు హల్ చల్ చేస్తున్నాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిసోడియా, మరికొందరిపై నమోదు చేసిన ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడా లేదని సీబీఐకి కవిత లేఖ రాశారు. సీబీఐ వెబ్ సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ కాపీని క్షుణ్ణంగా పరిశీలించానని వెల్లడించారు. అయితే.. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఆరో తేదీన తాను సీబీఐ అధికారులను కలువలేకపోతున్నానని తెలిపారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన నివాసంలో వివరణ ఇచ్చేందుకు అందుబాటులో ఉంటానని సీబీఐకి లేఖలో తెలిపారు.

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈడీ అధికారులు వెల్లడించారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ఈడీ అధికారులు బయటపెట్టారు. Aసౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించిందని ఈడీ పేర్కొంది. సౌత్గ్రూప్‌ను శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. సౌత్గ్రూప్ ద్వారా రూ.100 కోట్లను విజయ్నాయర్కు చేర్చినట్లు ఈడీ వెల్లడించింది. దర్యాప్తులో ఇచ్చిన వాంగ్మూలంలో అమిత్ అరోరా ధ్రువీకరించారని ఈడీ రిమాండ్ రిపోర్ట్ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మద్యం కుంభకోణం కేసులో తన పేరు చేర్చడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే మోడీ కంటే ఈడీ ముందుగా వచ్చిందన్నారు. ఇది రాజకీయ ఎత్తుగడలో భాగంగానే జరుగుతుందన్న కవిత.. కేసులు పెట్టుకోండి..అరెస్టులు చేసుకోండి..జైల్లో పెట్టుకోండి అని సవాల్ చేశారు. 8 ఏళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలని బీజేపీ పడగొట్టిందని మండిపడ్డారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు కవిత స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..