తెలంగాణ పోలింగ్లో పాల్గొనే వారికి గుడ్ న్యూస్ చెప్పింది సీఈసీ. తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ సమయాన్ని పెంచింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. తాజాగా ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుందని ప్రకటించింది. సాధారణంగా పోలింగ్ నిర్వహించే సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండగా తాజాగా ఒక గంట సమయాన్ని పొడిగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ ఉక్కపోతలతో, ఎండ తీవ్రతకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. దీనిపై వాతావరణ శాఖ కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది.
మే నెల మొత్తం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని కీలక ప్రకటన చేసింది. పైగా సమ్మర్ కారణంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఆసక్తిగా ఓటు వేసే వారికి ఈ ఎండలు కాస్త ఇబ్బందికి గురిచేస్తుందని గుర్తించిన ఎన్నికల అధికారులు పోలింగ్ సమయాన్ని పెంచినట్లు తెలుస్తోంది. అలాగే సమ్మర్ కారణంగా పోలింగ్ సమయాన్ని పెంచాలని పలు రాజకీయ పార్టీలు ఈసి కి వినతి పత్రాన్ని అందించినట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీల ఫిర్యాదు మేరకు పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పెంచినట్లు ఈసీ స్పష్టం చేసింది. మామూలు రోజుల్లో సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లలో నిలుచున్న వారికి మాత్రమే ఓటు హక్కును కల్పించే పోలింగ్ అధికారులు తాజాగా ఈసీ తీసుకున్న నిర్ణయంతో సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లలో నిలుచున్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..