BJP to TRS Party: తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాజీకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ఉన్న పార్టీల నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. అయితే.. తాజాగా దుబ్బాక మునిసిపాలిటీలో వింత రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. దుబ్బాక మునిసిపాలిటీకి చెందిన ముగ్గురు టీఆర్ఎస్ కౌన్సిలర్లు మంగళవారం బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో చేరారు. చేరి 24 గడువక ముందే మళ్లీ టీఆర్ఎస్‌లో చేరారు. మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో దుబ్బాక మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్స్ చేరారు. 7వ వార్డు కౌన్సిలర్ దివిటి కనకయ్య, 8 వ వార్డ్ కౌన్సిలర్ బాలకృష్ణకు మంత్రి హరీశ్ రావు గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు. అభివృద్ధి చేస్తున్న టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని కౌన్సిలర్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కాగా.. దుబ్బాకకు చెందిన కౌన్సిలర్లు మట్ట మల్లారెడ్డి, డివిటి కనుకయ్య, దుబ్బాక బాలకృష్ణ గౌడ్‌లకు మంగళవారం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, విజయశాంతి పలువురు నేతలు కూడా హాజరయ్యారు. అయితే.. చేరి కొన్ని గంటలు గడువక ముందే మళ్లీ సొంత గూటికే వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: