AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Drugs: డ్రగ్స్ సప్లయర్ లక్ష్మీపతి అరెస్టు.. కీలక వివరాలు వెల్లడించిన నార్కోటిక్ విభాగం డీసీపీ

హైదరాబాద్ లో మత్తు పదార్థాలు విక్రయిస్తూ బీటెక్‌ విద్యార్థి మృతికి కారణమైన లక్ష్మీపతి(Laxmipathi) ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నార్కోటిక్స్‌ విభాగం డీసీపీ చక్రవర్తి వివరాలు వెల్లడించారు. ‘డ్రగ్స్‌ సరఫరాదారు లక్ష్మీపతి తనకున్న నెట్‌వర్క్‌ ద్వారా హ్యాష్‌ ఆయిల్‌ విక్రయిస్తున్నట్లు పోలీసులు...

Hyderabad Drugs: డ్రగ్స్ సప్లయర్ లక్ష్మీపతి అరెస్టు.. కీలక వివరాలు వెల్లడించిన నార్కోటిక్ విభాగం డీసీపీ
Laxmipathi Arrest
Ganesh Mudavath
|

Updated on: Apr 06, 2022 | 7:40 PM

Share

హైదరాబాద్ లో మత్తు పదార్థాలు విక్రయిస్తూ బీటెక్‌ విద్యార్థి మృతికి కారణమైన లక్ష్మీపతి(Laxmipathi) ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నార్కోటిక్స్‌ విభాగం డీసీపీ చక్రవర్తి వివరాలు వెల్లడించారు. ‘డ్రగ్స్‌ సరఫరాదారు లక్ష్మీపతి తనకున్న నెట్‌వర్క్‌ ద్వారా హ్యాష్‌ ఆయిల్‌ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2016లో అరెస్టైన లక్ష్మీపతిపై ఇప్పటి వరకు 6 కేసులు ఉన్నాయి. నిందితుల వద్ద నుంచి సుమారు 5 లక్షల రూపాయలు విలువైన హ్యాష్‌ ఆయిల్‌(Hash Oil) స్వాధీనం చేసుకున్నారు. నల్లకుంటలో నమోదైన కేసులో లక్ష్మీపతితో 18 మంది కాంటాక్టులో ఉన్నట్టు వివరించారు. అరకు నుంచి లక్ష్మీపతికి హ్యాష్ అయిల్‌ సరఫరా చేస్తున్న నగేశ్‌ను కూడా అరెస్టు(Arrest) చేశారు. నగేశ్‌ అరకులో గంజాయి పండిస్తూ హ్యాష్ అయిల్‌ తయారు చేస్తున్నాడు. ఈ ఆయిల్ ను ఒడిశా, తమిళనాడు, దిల్లీ, కర్ణాటక, కేరళ, ముంబై, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ కు తరలిస్తున్నాడు. ఇతనిపై నల్గొండలో కేసు నమోదైంది. ఈ కేసులో మరికొంత మంది నిందితులు పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన లక్ష్మీపతి బీటెక్‌ మధ్యలోనే ఆపేశాడు. నగరంలోని మణికొండకు మకాం మార్చి మత్తు దందా ప్రారంభించాడు.

డ్రగ్స్‌కు అలవాటు పడి చివరికి చావును కొనితెచ్చుకున్న తొలి మరణం హైదరాబాద్‌లో జరిగింది. ఇప్పటి వరకూ సరదా కోసం, కిక్కు కోసం, వ్యవసాన్ని వదిలించుకోలేక డ్రగ్స్‌కు తీసుకుంటున్న యువతను చూశాం. విన్నాం. కానీ.. ఇది అంతకుమించిన వార్త. హైదరాబాద్‌కు చెందిన ఓ బీటెక్‌ విద్యార్థి గోవా(Goa) వెళ్లాడు. అక్కడ ఫస్ట్ డ్రగ్స్ తీసుకున్నాడు. అది కాస్తా అలవాటుగా ఆపై వ్యసనంగా మారింది. డోస్ పెరిగే కొద్ది ప్రాణం మీదకొచ్చింది. చివరికి అస్వస్థతతో ఆస్పత్రి పాలై.. కేవలం వారం అంటే వారంలోనే ప్రాణం పోగొట్టుకున్నాడు. చనిపోయే ముందు ఆస్పత్రిలో ఆ విద్యార్థి విలవిల్లాడుతూ కనిపించాడు.మెదడులో స్ట్రోక్స్ వచ్చి చికిత్స పొందతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. డ్రగ్స్‌ వేళ్లూనుకున్నాయని ఇప్పటివరకూ చెప్పుకుంటున్న హైదరాబాద్‌లో ఇప్పుడు ఓ మరణం కూడా సంభవించడం సంచలనంగా మారింది.

Also Read

Tamilnadu: చ‌నిపోయాడ‌ని పూడ్చిపెట్టారు.. కట్ చేస్తే.. 24 గంట‌ల్లోనే ఇంటికి తిరిగొచ్చాడు..

Corona Fourth Wave: భారత్‌లో18 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్‌ డోస్‌!.. సీరం సీఈవో ఏమన్నారంటే..

Andhra Pradesh: ఏపీలో 5 గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లు.. కీలక వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి