Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌పై సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మద్యం తాగి డ్రైవిండ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మద్యం సేవించి వాహనం నడిపై కేసులు నమోదు చేయడంతో పాటు.. వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. గత వారం రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను పోలీసులు చేస్తున్నారు. ఆదివారం రాత్రి 346 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో దాదాపు 26 నుంచి 45 ఏళ్ల వయస్సు వారు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇక పట్టుబడ్డ వాహనాల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలే ఉన్నట్లు చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను పూర్తిగా అరికట్టే వరకు ఈ తనిఖీ చేస్తామని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు స్పష్టం చేశారు. కాగా, గత వారం రోజులుగా చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో సైబరాబాద్ పరిధిలో 3751 డీడీ కేసులు నమోదైనట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Also read:
Vennela Kishore Aha OTT: ‘ఆహా’ కోసం రంగంలోకి దిగనున్న కమెడియన్.. వేణు ఉడుగుల నిర్మాణంలో..
Sonu Sood Visit: స్వర్ణిమ్ కౌంటర్‌ను సందర్శించిన సోనూసూద్… ప్రత్యేక సేవలు బాగున్నాయని కితాబు…