Aishwarya In HYD: భాగ్యనగరంలో తళుక్కుమన్న మాజీ ప్రపంచ సుందరి.. భర్త, కూతురుతో కలిసి..

Aishwarya Spotted In Hyderabad:మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ బచన్‌ ఆదివారం హైదరాబాద్‌లో సందడి చేశారు. నగరంలో జరిగిన..

Aishwarya In HYD: భాగ్యనగరంలో తళుక్కుమన్న మాజీ ప్రపంచ సుందరి.. భర్త, కూతురుతో కలిసి..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 04, 2021 | 10:44 AM

Aishwarya Spotted In Hyderabad: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ బచన్‌ ఆదివారం హైదరాబాద్‌లో సందడి చేశారు. నగరంలో జరిగిన ఓ వేడుకకు ఐశ్వర్య హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఐశ్‌ భర్త అభిషేక్‌, కూతురు ఆరాధ్యతో కలిసి రావడం విశేషం. ఇదిలా ఉంటే అమితాబ్‌తో పాటు ఐశ్వర్య, అభిషేక్‌ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. దీంతో గత పది నెలలుగా ఐశ్వర్య బయటకు వచ్చింది లేదు. ముంబైలోనూ ఈ తార గడిచిన 10 నెల్లలో ఒక్కసారికూడా మీడియాకు కనిపించలేదు. ఈ నేపథ్యంలో నగరానికి కుటుంబసమేతంగా వచ్చిన ఐశ్వర్య ఎయిర్‌ పోర్టులో మీడియా కంటికి చిక్కారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. 2018లో వచ్చిన ‘ఫన్నీ ఖాన్‌’ చిత్రం తర్వాత ఈ అందాల తార మరో చిత్రంలో కనిపింలేదు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రంలో ఐశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్‌ డ్యూయల్‌ రోల్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Drunk and Drive: మందు బాబులకు ఝలక్ ఇస్తున్న సైబరాబాద్ పోలీసులు.. వారం రోజుల్లో3571 కేసులు నమోదు..