Telangana: గాడిద గుడ్డు పాలిటిక్స్.. రేవంత్ రెడ్డి క్యాంపైన్ స్టైల్‌‌పై బీజేపీ సెటైర్.. పాము గుడ్డు సింబల్ ఇవ్వాలంటూ..

ప్రధాని మోదీ తెలంగాణకు ఏం చేశారు? తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చింది? గాడిద గుడ్డు ఇచ్చింది అంటూ.. సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తెలంగాణలో ఎక్కడ సభ నిర్వహించినా ప్రజలకు రేవంత్‌ వేసే ప్రశ్న ఇదే. ఆన్సర్‌ కూడా ఇదే. తెలంగాణకు బీజేపీ పెద్ద గాడిద గుడ్డు ఇచ్చింది అంటున్నారు రేవంత్‌. రొటీన్‌కు భిన్నంగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు.

Telangana: గాడిద గుడ్డు పాలిటిక్స్.. రేవంత్ రెడ్డి క్యాంపైన్ స్టైల్‌‌పై బీజేపీ సెటైర్.. పాము గుడ్డు సింబల్ ఇవ్వాలంటూ..
Revanth Reddy Kishan Reddy

Updated on: May 04, 2024 | 6:33 PM

ప్రధాని మోదీ తెలంగాణకు ఏం చేశారు? తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చింది? గాడిద గుడ్డు ఇచ్చింది అంటూ.. సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తెలంగాణలో ఎక్కడ సభ నిర్వహించినా ప్రజలకు రేవంత్‌ వేసే ప్రశ్న ఇదే. ఆన్సర్‌ కూడా ఇదే. తెలంగాణకు బీజేపీ పెద్ద గాడిద గుడ్డు ఇచ్చింది అంటున్నారు రేవంత్‌. రొటీన్‌కు భిన్నంగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మీద తన స్టైల్‌లో విరుచుకుపడుతూనే.. కాషాయ పార్టీని స్పెషల్‌గా టార్గెట్‌ చేస్తున్నారు. గాడిద గుడ్డును చూపిస్తూ, బీజేపీపై గట్టిగా విరుచుకుపడుతున్నారు. దీంతో రేవంత్‌ ప్రచారం డిఫరెంట్‌ స్టైల్‌లో సాగుతోంది.

తాజాగా.. కొత్తగూడెం సభలో కూడా పాత డైలాగుతోనే బీజేపీపై రేవంత్‌ విరుచుకుపడ్డారు. తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చింది అంటే, గాడిద గుడ్డు ఇచ్చింది అనాలంటూ జనాన్ని కోరారు. ఇలా పదే పదే అంటూ జనంలో జోష్‌ నింపే ప్రయత్నం చేశారు. మీరు రెడీనా? మీరు రెడీనా అంటూ ప్రజలను ప్రశ్నించారు. రేవంత్ క్వశ్చన్స్‌ అండ్‌ జనం ఆన్సర్లు కొత్త ట్రెండ్‌గా మారాయి.

ఈ మధ్య సీఎం రేవంత్‌ రెడ్డి తన ప్రతి ఎలక్షన్‌ క్యాంపెయిన్‌ లోనూ గుడ్డు ప్రాపర్టీని గట్టిగా వాడేస్తున్నారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఈ గాడిద గుడ్డేనంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేం లేదంటూ ఈ గుడ్డును సింబాలిక్‌గా జనాలకు చూపిస్తున్నారు రేవంత్‌రెడ్డి. ఇక సోషల్‌ మీడియాలోనూ గాడిద గుడ్డును గట్టిగానే ప్రమోట్‌ చేస్తోంది అధికార కాంగ్రెస్. జీఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి డబ్బులు వసూలు చేసి…తిరిగి గాడిద గుడ్డును ఇస్తోందంటూ ముమ్మరం ప్రచారం నిర్వహిస్తోంది. మోదీ సొంత రాష్ట్రానికి మాత్రం భారీగా నిధులు కేటాయిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్‌..

వీడియో చూడండి..

పాముగుడ్డును సింబల్‌గా కేటాయిస్తే బాగుంటుంది.. కిషన్, లక్ష్మణ్‌ ఫైర్

కాంగ్రెస్‌ గుడ్డు పాలిటిక్స్‌పై గాడిద గుడ్డేం కాదు అంటోంది బీజేపీ. రేవంత్‌పై బీజేపీ సీనియర్‌ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ తీరును తప్పుబట్టారు. తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున హామీలిచ్చి.. ఇప్పుడు గాడిద గుడ్డు ఇస్తున్నది కాంగ్రెస్‌ పార్టీనే అంటూ ఆయన కౌంటర్‌ అటాక్‌కి దిగారు. ఇక బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ లక్ష్మణ్‌ కూడా సీఎం రేవంత్‌ తీరుపై నిప్పులు చెరిగారు. సీఎం అయి ఉండి.. గాడిద గుడ్డును చూపిస్తూ ప్రచారం నిర్వహించడమేంటంటూ మండిపడ్డారు. తమ స్థాయిని తగ్గించుకుని ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ నేతల తీరు చూస్తుంటే.. వాళ్ల పార్టీకి పాముగుడ్డును సింబల్‌గా కేటాయిస్తే బాగుంటుందంటూ సెటైర్‌ వేశారు లక్ష్మణ్‌..

మొత్తంగా… గాడిద గుడ్డు చుట్టూ తిరుగుతోంది తెలంగాణ రాజకీయం. అసలు ఎవరు గుడ్డు.. ఎవరు బ్యాడు.. ఎవరు వెరీ గుడ్డు అని తెలియాలంటే జూన్‌ 4 వరకు ఆగాల్సిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us