Inspiring Doctors Award: కరోనా సమయంలో చేసిన సేవలకు గుర్తింపు.. డా.విష్ణున్ రావుకు ఇన్స్పైరింగ్ డాక్టర్స్ అవార్డు

|

Jul 02, 2022 | 11:25 AM

తెలంగాణా నుంచి శ్వాస హాస్పిటల్ చైర్మన్ విష్ణున్ రావు వీరపనేని, డా ఆర్ . విజయ్ కుమార్ లు ఢిల్లీలో హయత్ రీజెన్సీ హోటల్ లో కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పల్మొనాలజీ విభాగంలో ఇన్స్పైరింగ్ డాక్టర్స్ గా అవార్డు ను అందుకున్నారు.

Inspiring Doctors Award: కరోనా సమయంలో చేసిన సేవలకు గుర్తింపు.. డా.విష్ణున్ రావుకు ఇన్స్పైరింగ్ డాక్టర్స్ అవార్డు
Inspiring Doctors Award
Follow us on

Inspiring Doctors Award: వైద్యో నారాయణ హరిః అన్నారు పెద్దలు..అవును డాక్టర్లు కనిపించని దేవుళ్లకంటే ఎక్కువ.. స్వచ్ఛమైన తెల్లని కోటు, ఆత్మీయమైన చెరగని చిరునవ్వు, మొక్కవోని నిబ్బరంతో ప్రాణాలు పోసే డాక్టర్ల గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటూ.. కృతజ్ఞతగా జూలై 1వ తేదీన దేశ వ్యాప్తంగా డాక్టర్స్ డే ఘనంగా జరిగింది. దేశ వ్యాప్తంగా inspiring doctors of pulmonology లో 20 మంది డాక్టర్లకు డాక్టర్స్ డే సందర్బంగా ఎకనామిక్ టైమ్స్ ఈ అవార్డును ప్రధానం చేసారు . తెలంగాణా నుంచి శ్వాస హాస్పిటల్ చైర్మన్ విష్ణున్ రావు వీరపనేని, డా ఆర్ . విజయ్ కుమార్ ఈ అవార్డు, ఢిల్లీలో హయత్ రీజెన్సీ హోటల్ లో ( hyath regency hotel ) కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పల్మొనాలజీ విభాగంలో ఇన్స్పైరింగ్ డాక్టర్స్ గా అవార్డు ను ( inspiring Doctors award) అందుకున్నారు. డా విష్ణున్ రావు కరోనా వైరస్ విజృంభించిన సమయంలో  మీడియా ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే.

డా. విష్ణున్ రావు కోవిడ్ పై అవగాహన కలిగిస్తూనే.. కరోనా బాధితులు.. ఇంటిలో ఉండి వైద్యం ఎలా పొందాలో వివరిస్తూ.. బాధితులకు దైర్యం నింపేవారు. అత్యవసరం అయితే తప్ప.. హాస్పిటల్ అడ్మిషన్స్ వద్దని చెప్పేవారు. ఈ అవగాహన కార్యక్రమం అనేక మంది కరోనా బాధితులకు ఉపయోగపడింది. హాస్పిటల్ కి ఏ సమయంలో పోవాలి అనేది వివరించి చెప్పేవారు. ఊపితిత్తులకు సంబంధించి అన్ని వ్యాధులపై అవగాహన కల్పిస్తూ.. వారిలో దైర్యం నింపేవారు. ఇప్పుడు అలర్జీ ,ఆస్తమా వ్యాధిపై అందరికీ అవగాహన కలిగిస్తున్నారు. కాలుష్యం వల్ల అందరి ఆరోగ్యం ఏ విధంగా పాడైపోతుందో అందరికీ అవగాహన కలిగిస్తున్నారు. వివిధ వృత్తుల్లో వున్న వారు వారి వారి వృత్తుల్లో ఏ విధంగా బాధపడుతున్నారో సమాజానికి వివరిస్తున్నారు. పిల్లల ఊపితిత్తుల జబ్బుల గురించి ఎన్నో అవగాహనా కార్యక్రమాలు నిర్యహించారు. గత 25 సంవత్సరాలుగా ఆరోగ్య సూత్రాలపై కలిగిస్తున్న అవగాహనకు గుర్తింపుగా డా విష్ణున్ రావు ఈ అవార్డును అందుకున్నారు. తనకు వచ్చిన ఈ అవార్డును కోవిడ్ వారియర్స్ కి అందరికీ అంకితం చేసారు డా విష్ణున్ రావు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి