RGV: బండి సంజయ్ తనయుడి వీడియోపై వర్మ సంచలన కామెంట్స్.. ఉదయ్ హుస్సేన్ మళ్లీ పుట్టాడంటూ..
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వీడియో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బండి భగీరథ్ తోటి విద్యార్థిని దూషిస్తూ, భౌతిక దాడి చేసిన సమయంలో తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది...
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కి సంబంధించి వీడియో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బండి భగీరథ్ తోటి విద్యార్థిని దూషిస్తూ, భౌతిక దాడి చేసిన సమయంలో తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ అంశం రాజకీయంగానూ దుమారం రేపుతోంది. టీఆర్‌ఎస్ నాయకులు ఈ వీడియోను అస్త్రంగా మార్చుకొని బండి సంజయ్‌పై కౌంటర్‌కి దిగారు. ఈ అంశంపై రాజకీయ నాయకులు స్పందిస్తున్న తరుణంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం స్పందించారు.
సమాజాంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందించే రామ్‌గోపాల్ వర్మ బండి భగీరథ్ వీడియోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ.. ‘ఒకప్పుడు ఇరాక్ ప్రజలను వణికించిన నియంత సద్దాం హుస్సేస్‌ను మంచిన ఆయన కుమారుడు ఉదయ్ హుస్సేన్ నాటి రోజులు అంతరించిపోయాయి. కానీ ఇప్పుడు మళ్లీ అతను బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ రూపంలో పుట్టాడు’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడీ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తాను రాజకీయాకుల దూరంగా ఉంటానంటూనే వర్మ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. మొన్నటికి మొన్న ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ అందరి దృష్టిని ఆకర్షించారు.
I thought the days of Iraq dictator #Saddam ‘s like sons #UdayHussein were over and now he is reincarnated as @bandisanjay_bjp ‘s son #bhageerqth who as a son YUCKED his FATHER pic.twitter.com/Btzfc4i8ya
— Ram Gopal Varma (@RGVzoomin) January 17, 2023
ఇదిలా ఉంటే తన తనయుడి వీడియోకు సంబంధించి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. పిల్లలతో రాజకీయాలు చేయడమేంటని ప్రశ్నించారు. కుమారుడిపై కేసు నమోదు కావడంపై సీరియస్ గా స్పందించారు. సీఎం కేసీఆర్ తనతో రాజకీయాలు చేయాలే తప్ప పిల్లలతో రాజకీయాలేంటని మండిపడ్డారు. పిల్లలు కొట్టుకుంటే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. గతంలో సీఎం మనుమడిపై కామెంట్లు చేస్తే.. తానే స్వయంగా ఖండించానని, ఎప్పుడో జరిగిన ఘటనపై ఇప్పుడు కేసులేంటని బండి సంజయ్ ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..