Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Last Nizam of Hyderabad: నిజాం అంత్యక్రియలకు సర్వం సిద్ధం.. చౌమహల్లా ప్యాలెస్‌లో పార్థీవదేహం..

చివరి నిజాంని ఘనంగా సాగనంపేందుకు సర్వం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి చౌమహల్లాప్యాలెస్‌లో ప్రజల సందర్శనార్ధం ఉంచనున్నారు.

The Last Nizam of Hyderabad: నిజాం అంత్యక్రియలకు సర్వం సిద్ధం.. చౌమహల్లా ప్యాలెస్‌లో పార్థీవదేహం..
Nizam Of Hyderabad
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 18, 2023 | 8:48 AM

చివరి నిజాంని ఘనంగా సాగనంపేందుకు సర్వం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి చౌమహల్లాప్యాలెస్‌లో ప్రజల సందర్శనార్ధం ఉంచనున్నారు. అయితే నిజాం హిందూ వ్యతిరేకి అన్న వివాదం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

నిజాం హిందూ వ్యతిరేకా?

నిజాం నవాబు హిందూ వ్యతిరేకి కాదన్న వాదన బలంగా ఉంది. ఆయన హిందూ వ్యతిరేకి అయితే ఇప్పుడు చనిపోయిన ఎనిమిదో నవాబు.. తన దర్బార్‌లో కచేరీకి సంబంధించి హిందువును నియమించారు. అలాగే తిరుపతి, యాదగిరి గుట్ట..ఇలా ఎన్నో ప్రసిద్ద ఆలయాలకు భారీ విరాళాలు ఇచ్చారని, నిజాం హిందూ వ్యతిరేకి కాదన్నది నిజాం మద్దతుదారుల మాట. మరోవైపు అధికార లాంఛనాలతో ముఖర్రంజా అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ సలహాదారు ఏకేఖాన్ నేతృత్వంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రోటోకాల్ ఇష్యూ..

అయితే నిజాం వారసుడి అంత్యక్రియల్లో ప్రొటోకాల్‌ ఇష్యూ పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. అధికారిక లాంఛనాలకు విశ్వహిందూ పరిషత్‌ అడ్డుచెపుతోంది. నిరంకుశత్వానికి మారుపేరులాంటి నిజాం వంశస్థుడికి అధికారలాంఛనాలతో అంత్యక్రియలు జరపడంపై విశ్వహిందూపరిషత్‌, బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

నిరంకుశ రాచరిక పాలనకు చరమ గీతం పాడేందుకు తెగించి పోరాడిన తెలంగాణ ప్రజల త్యాగాలను అవమానించడమేనని తెగేసి చెపుతోంది. మహిళల బట్టలిప్పి బతుకమ్మ లాడించిన చరిత్రను కేసీఆర్‌ గుర్తుపెట్టుకోవాలని వీహెచ్‌పీ నేతలు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను కించ పరిస్తే.. ప్రజలు తగిన గుణపాఠం చెబుతారంటూ హెచ్చరించారు.

మరోవైపు ముఖరం ఝా అంత్యక్రియలకు సర్వసన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రోజు ప్రత్యేక విమానంలో 8వ నిజాం పార్థివ దేహాం హైదరబాద్‌కి చేరుకుంది. చివరిసారి చూసేందుకు నిజాం అభిమానులు భారీగా చేరుకున్నారు…సీఎం కేసీఆర్‌ కూడా ఆయనకు నివాళులర్పించారు.

ముఖరం ఝా కోరిక మేరకు హైదరాబాద్‌లోని మక్కా మసీదులో ఆయన సమాధిని ఉంచేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు ముఖరం ఝా భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్‌లో ఉంచుతారు.,చౌమహల్లా ప్యాలెస్ లో సాంప్రదాయ కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం.. అసఫ్ జాహీల సమాధుల వద్ద అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు.

చివరి నిజాం తదనంతరం.. ఆయన భార్యే ఆస్తుల విషయాలు చూసుకోనున్నారు. అయితే చివరి నిజాం వారసులు ఎంతమంది వారంతా ఎక్కడున్నారు అనే వివాదం కూడా ఉంది. రాబోయే రోజుల్లోనే ఈ వివాదం తేలనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..