Hyderabad: హైదరాబాదీలు అలర్ట్.. బుధవారం రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు. ఈ రూట్స్ అవైడ్ చేయండి.
హైదరాబాదీలను ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ చేశారు. బుధవారం నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్‌ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ ఆంక్షలను...
హైదరాబాదీలను ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ చేశారు. బుధవారం నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్‌ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని పలు మార్గాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నట్లు తెలిపారు.
సోమాజిగూడ నుంచి ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వరకు ఈ ఆంక్షలు ఉండనున్నాయి. సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, రసూల్‌పురా, సీటీవో, ఎస్‌బీహెచ్ జంక్షన్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, అల్లుగడ్డ బావి, మెట్టుగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్జీఆర్‌ఐ, ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఈ మార్గాలను అవైడ్ చేసి, ఇతర మార్గాలను ఎంచుకోవాలని తెలిపారు.
ముఖ్యంగా మ్యాచ్ ప్రారంభానికి, ముగింపు సమయంలో ప్రత్యామ్నాం మార్గాలను ఎంచుకోవాలని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రయాణికుల సౌకర్యార్థం అధికారులు మెట్రో సేవలను అదనంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో కారిడార్-3 (నాగోల్-రాయదుర్గం)లో అదనపు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నిమిషాలకు ఒక రైలు బదులు 5 నిమిషాల ఫ్రీక్వెన్సీతో, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 4 నిమిషాల ఫ్రీక్వెన్సీతో సర్వీసులు నడువనున్నాయి. అంతేకాకుండా స్టేడియం వద్ద ఉన్న మెట్రో స్టేషన్‌లో 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..