AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ Match: ఉప్పల్‌ వేదికగా నేడు తొలి వన్డే.. న్యూజిలాండ్‌తో తలపడనున్న టీమిండియా..

లంకపై సిరీస్‌ క్లీన్‌స్వీప్‌తో జోష్‌లో ఉన్న టీమిండియా.. పాక్‌పై విజయంతో జోరు మీదున్న న్యూజిలాండ్. రెండు జట్లు ఈరోజు ఉప్పల్‌లో వన్డే వార్‌కి రెడీ అయ్యాయి. మూడు వన్డేల సిరీస్‌లో పలు మార్పులతో బరిలోకి దిగబోతున్నాయి ఇరు జట్లు. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిశాక రెండు రోజుల విరామం..

IND vs NZ Match: ఉప్పల్‌ వేదికగా నేడు తొలి వన్డే.. న్యూజిలాండ్‌తో తలపడనున్న టీమిండియా..
Ind Vs Nz Match
Narender Vaitla
|

Updated on: Jan 18, 2023 | 6:35 AM

Share

లంకపై సిరీస్‌ క్లీన్‌స్వీప్‌తో జోష్‌లో ఉన్న టీమిండియా.. పాక్‌పై విజయంతో జోరు మీదున్న న్యూజిలాండ్. రెండు జట్లు ఈరోజు ఉప్పల్‌లో వన్డే వార్‌కి రెడీ అయ్యాయి. మూడు వన్డేల సిరీస్‌లో పలు మార్పులతో బరిలోకి దిగబోతున్నాయి ఇరు జట్లు. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిశాక రెండు రోజుల విరామం అనంతరం మరో పోరుకు సిద్ధమైంది టీమిండియా. నేడు హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో వన్డే సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌కి ముందే భారత్‌కు భారీ షాక్ తగిలింది. వెన్నెముక గాయంతో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటికే పెళ్లి కారణంగా కేఎల్‌ రాహుల్‌, వ్యక్తిగత పనులతో అక్షర్ పటేల్‌ టీమ్‌కి దూరమయ్యారు. ఈ ముగ్గురి ప్లేస్‌లో ఎవరెవర్ని రిప్లేస్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

శ్రేయస్ ప్లేస్‌లో రజత్ పాటిదార్‌ టీమ్‌లో రానున్నట్టు తెలుస్తోంది. రేపటి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉంది. అయితే ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో వస్తాడన్న సంకేతాలిచ్చాడు కెప్టెన్ రోహిత్‌ శర్మ. ఇక అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్, చాహల్‌లలో ఎవరిని ఆడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. చాహల్ గాయపడటంతో శ్రీలంకపై రెండో వన్డేలో చోటు దక్కించుకున్న కుల్దీప్ యాదవ్.. 4 వికెట్లతో సత్తా చాటాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో దసున్ షనకను బౌల్డ్ చేశాడు. ఒకవేళ గాయం నుంచి చాహల్ కోలుకుంటే.. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లలో ఎవర్ని ఆడిస్తారనేది చూడాలి.

కివీస్‌ టీమ్‌ రెండు మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. విలియమ్సన్‌, సౌథీలు టోర్నీకి దూరమయ్యారు. వారి ప్లేస్‌లో యంగ్‌ ప్లేయర్లకు అవకాశం కల్పిస్తామన్నారు కెప్టెన్ లాథమ్‌. వరల్డ్ నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న కివీస్‌ను తక్కువగా అంచనా వేయలేం. అందుకే హోరాహోరీ పోరుతో ఉప్పల్‌ స్టేడియం ఊగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అభిమానులు సైతం మ్యాచ్‌ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు బ్లాక్ టికెట్ల దందా ఇటు హెచ్‌సీఏకు అటు పోలీసులకు తలనొప్పిగా మారింది. వెయ్యి రూపాయల టికెట్లను మూడు వేలకు అమ్మేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటూ మరీ విక్రయిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

భారీ బందోబస్తు..

ఈ దందాపై ప్రత్యేక దృష్టి సారించారు రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు. బ్లాక్‌లో టికెట్లు ఎవరు అమ్మినా ఉపేక్షించేది లేదని.. కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మ్యాచ్‌కి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది హెచ్‌సీఏ. అస్తవ్యస్తంగా మారిన సీటింగ్‌ను సమూలంగా మార్చేసింది. మొబైల్స్‌, బ్యాగ్‌లను మాత్రమే అనుమతిస్తామని.. వాటర్ బాటిళ్లకు అనుమతించబోమని స్పష్టం చేసింది. మరోవైపు ఇప్పటికే స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..