Telangana: ఒకప్పుడు అందమైన టూరిస్ట్ ప్లేస్.. పర్యాటక శాఖ శీతకన్ను.. నేడు కళా విహీనం

| Edited By: Surya Kala

Jun 12, 2024 | 7:15 PM

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో పాలేరు రిజర్వాయర్ దశాబ్దాల కాలం నుంచి అందమైన పార్కులు ఉండేవి. ఒకవైపు రిజర్వాయర్ ఉండటంతో ఆహ్లాదమైన వాతావరణం, పార్కులోని పచ్చదనం పాలేరు రిజర్వాయర్ పర్యాటకులను మైమరిపించేది. జిల్లా పర్యటక శాఖ రెండు పార్కుకులను ఏర్పాటు చేసింది. ఫౌంటేన్లను ఏర్పాటు చేసి, బోటింగ్ సదుపాయంన్నిసమకూర్చింది. ఐదుగురు కూర్చునే మర బోట్ల కు తోడు 24మంది కూర్చుని పాలేరు జలాశయంలో విహరించే అవకాశం కలిగిన పెద్ద మర బొట్లను ఏర్పాటు చేసింది.

Telangana: ఒకప్పుడు అందమైన టూరిస్ట్ ప్లేస్.. పర్యాటక శాఖ శీతకన్ను.. నేడు కళా విహీనం
Palair Reservoir In Paleru
Follow us on

పాలేరు జలాశయం ఒకప్పుడు పర్యాటకులతో కళకళలాడేది.  అలాంటి పర్యాటక కేంద్రం పై పర్యాటక శాఖ శీతకన్ను వేయడం, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆ ప్రాంతం పర్యాటకులకు ఆతిధ్యం ఇవ్వలేకపోతోంది. జిల్లా సరిహద్దు లో ఉన్న పాలేరు జలాశయం, దాని చుట్టూ ఉన్న పార్కులు కళావిహీనంగా మారటంతో పర్యాటకుల సంఖ్య తగ్గింది. పార్కులకు వచ్చే వారి రద్దీ తగ్గిపోవడం తో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. అద్వానంగా ఉన్న పార్కును అభివృద్ధి చేసి జలాశయం లో బోటింగ్
చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో పాలేరు రిజర్వాయర్ దశాబ్దాల కాలం నుంచి అందమైన పార్కులు ఉండేవి. ఒకవైపు రిజర్వాయర్ ఉండటంతో ఆహ్లాదమైన వాతావరణం, పార్కులోని పచ్చదనం పాలేరు రిజర్వాయర్ పర్యాటకులను మైమరిపించేది. జిల్లా పర్యటక శాఖ రెండు పార్కుకులను ఏర్పాటు చేసింది. ఫౌంటేన్లను ఏర్పాటు చేసి, బోటింగ్ సదుపాయంన్నిసమకూర్చింది. ఐదుగురు కూర్చునే మర బోట్ల కు తోడు 24మంది కూర్చుని పాలేరు జలాశయంలో విహరించే అవకాశం కలిగిన పెద్ద మర బొట్లను ఏర్పాటు చేసింది. పిల్లలు ఆడుకునేదుకు నిర్మించి ప్రత్యేకమైన పార్కు పిల్లలతో రద్దీగా ఉండేది.

ఖమ్మం హైదరాబాద్ ప్రధాన రహదారి కావడం రహదారి పక్కనే ఉన్న పాలేరు జలాశయం చుట్టూ కొండలతో ప్రధాన రహదారి పక్కన టూరిజం పార్క్ ఉండటంతో పర్యాటకులు ఖమ్మం జిల్లాతోపాటు సూర్యాపేట నల్గొండ జిల్లాల నుంచి పర్యాటకులు పాలేరు రిజర్వాయర్ వద్ద ఉన్న టూరిజం పార్కును కుటుంబ సభ్యులతో సందర్షించుకునేవారు. ప్రధాన రహదారిపై ప్రయాణించే వారు పాలేరు జలాశయం వద్ద ఆగి సేదతీరుతారు. అలాంటి టూరిజం పార్కుకు రానురాను పర్యాటకశాఖ పార్కు పై శ్రద్ధ చూపకపోవడంతో నేడు పార్కు రూపుకోల్పోయింది. అసాంఘిక కర్యక్రమలకు నిలయంగా మారిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్రీయ రహదారి పక్కనే ఉన్న ఈ పాలేరు టూరిజం పార్క్ ను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ,అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు స్థానికప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..