AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharmapuri Controversy: 17C డాక్యుమెంట్స్‌ భద్రపర్చిన ట్రంకు పెట్టెల తాళాలు మిస్‌.. ధర్మపురి ఎన్నికల రగడ కొలిక్కి వచ్చేనా..

ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు నెలకొంటున్నాయి. హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు పగుల కొట్టినా.. కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి.

Dharmapuri Controversy: 17C డాక్యుమెంట్స్‌ భద్రపర్చిన ట్రంకు పెట్టెల తాళాలు మిస్‌.. ధర్మపురి ఎన్నికల రగడ కొలిక్కి వచ్చేనా..
Dharmapuri Election
Sanjay Kasula
|

Updated on: Apr 23, 2023 | 7:54 PM

Share

ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రగడ ఇప్పట్లో కొలిక్కి వస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మొన్నటి వరకు స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు కనిపించలేదు. హైకోర్టు ఆదేశాలతో తాళాలు పగులకొట్టి లోపలకు వెళ్లితే.. కీలకమైన 17C డాక్యుమెంట్స్‌ భద్రపర్చిన 20 ట్రంకు పెట్టెల్లోని 16 వాటికి అసలు తాళాలే లేవు. కేవలం నాలుగు ట్రంకు పెట్టెలకే తాళలు వేసి ఉన్నాయి. ఫలితాలపై మొదటి నుంచి న్యాయపోరాటం చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణకుమార్ ఈ అంశంపై మరోసారి సందేహాలు వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలతో కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా, కేంద్ర ఎన్నికల సంఘం అధికారి అవినాష్‌ కుమార్‌ సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు పగులకొట్టారు.

కట్టుదిట్టమైన భద్రత మధ్య దాదాపు 200 మంది సిబ్బందితో 17C డాక్యుమెంట్లను లెక్కిస్తున్నారు. వీటన్నింటినీ సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు అందజేయనున్నారు అధికారులు. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత ఓట్లను తిరిగి లెక్కించాలా లేదా అన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

2018లో జరిగిన ధర్మపురి ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయన్నది కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి ఆరోపణ. ఆ ఎన్నికల్లో 441 ఓట్ల ఆధిక్యంతో అధికారపార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌. ఎన్నికల అధికారుల నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్‌ చేశారు అడ్లూరి. విచారణ కొలిక్కి వచ్చే తరుణంలో.. ఇప్పుడు అనేక ట్విస్ట్‌లు సమస్యను రక్తికట్టిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం