AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: కేసీఆర్‌ గద్దె దిగడం ఖాయం.. బీజేపీ పవర్‌లోకి రావడం పక్కా.. చేవెళ్ల విజయ సంకల్ప సభలో అమిత్‌ షా..

కాషాయ శ్రేణులకు విజయోపదేశం చేస్తూనే కేసీఆర్‌ సర్కార్‌పై పంచ్‌ డైలాగులు పేల్చారు అమిత్‌షా. BRS ప్రభుత్వం అవినీతికూపంలో కూరుకుపోయిందన్న షా... వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ గద్దె దిగడం ఖాయం...

Amit Shah: కేసీఆర్‌ గద్దె దిగడం ఖాయం.. బీజేపీ పవర్‌లోకి రావడం పక్కా.. చేవెళ్ల విజయ సంకల్ప సభలో అమిత్‌ షా..
Union Home Minister Amit Shah
Sanjay Kasula
|

Updated on: Apr 23, 2023 | 8:47 PM

Share

తెలంగాణలో కేసీఆర్​ ప్రభుత్వాన్ని గద్దే దింపే వరకూ బీజేపీ కార్యకర్తలు విశ్రమించరని కేంద్ర మంత్రి అమిత్​ షా స్పష్టం చేశారు. పేపర్‌ లీకేజ్‌పై ప్రశ్నించారని తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను జైల్లో పెట్టారని ఆరోపించారు. చేవెళ్ల విజయ సంకల్ప సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ షా మాట్లాడిన ప్రతి మాటా ఒక్కో తూటాలా పేలింది. కేసీఆర్‌ అండ్‌ పరివార్‌ టార్గెట్‌గా ప్రశ్నల వర్షం కురిపించారు. కాషాయ శ్రేణులకు విజయోపదేశం చేస్తూనే కేసీఆర్‌ సర్కార్‌పై పంచ్‌ డైలాగులు పేల్చారు అమిత్‌షా. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికూపంలో కూరుకుపోయిందన్న షా.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ గద్దె దిగడం ఖాయం.. బీజేపీ పవర్‌లోకి రావడం పక్కా అన్నారు. ఓవైసీపైనా నిప్పులు చెరిగారు అమిత్ షా. అసలు కేసీఆర్‌ స్టీరింగే.. ఓవైసీ చేతిలో ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని హామీ ఇచ్చారు.

టీఎస్‌పీఎస్‌సీ, టెన్త్‌ పేపర్ల లీక్‌పైనా ప్రశ్నల వర్షం కురిపించారు అమిషా. నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలాడుకుంటారా అంటూ కేసీఆర్‌ సర్కార్‌పై చెలరేగిపోయారు అమిత్ షా. జైళ్లకు వెళ్లేందుకు తమ పార్టీ నేతలు, కార్యకర్తలు భయపడరని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. కేసీఆర్​ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.

ఏం చెప్పాలనుకున్నారో? ఎవరిని విమర్శించాలనుకున్నారో? ఏ పాయింట్స్‌ రెయిజ్‌ చేయాలనున్నారో? సుత్తిలేకుండా స్ట్రెయిట్‌గా చెప్పారు అమిత్‌షా. కాషాయ శ్రేణులకు చెప్పాలనుకున్నది చెబుతూనే కేసీఆర్‌ సర్కార్‌పై పంచ్‌ డైలాగులు పేల్చారు అమిత్‌షా. ప్రతి మాటా కేసీఆర్‌ అండ్ ఫ్యామిలీ టార్గెట్‌నే వదిలారు. అదే టైమ్‌లో తెలంగాణ కమల దళానికి విజయోపదేశం చేశారు. గెలవాలి, గెలిచి తీరాలి అంటూ విజయ సంకల్పాన్ని నూరిపోశారు. ఇక, సభకు ముందు నోవాటెల్‌లో అరగంటపాటు ముఖ్యనేతలతో సమావేశమయ్యారు అమిత్‌షా. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలాగుంది?. ఎక్కడెక్కడ లోపాలున్నాయ్‌?. అధికారంలోకి రావాలంటే ఇంకా ఏమేం చేయాలి? అంటూ ఆరా తీశారు. మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని, కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టాలంటూ దిశానిర్దేశం చేశారు అమిత్‌షా.

పులి నుంచి ఫోన్ రావడంతో..

అంతకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​మాట్లాడుతూ.. తనను పోలీసులు అరెస్టు చేసి 8గంటలు రోడ్లపై తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి ఫోన్​ రావడంతో పోలీసులు కంగారు పడ్డారని.. కార్యకర్తలను కాపాడే ఆ పులి.. ఇప్పుడు చేవెళ్ల గడ్డపై అడుగు పెట్టిందనన్నారు. తెలంగాణలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. తమ పార్టీకి అవకాశమిస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

కాగా అమిత్‌షా సభను భారీ సక్సెస్‌ చేసేందుకు బీజేపీ శ్రేణులు సభాస్థలికి చేరుకున్నారు. బహిరంగ సభకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత అమిత్‌షా ఫోకస్ మొత్తం తెలంగాణపైనే నిలపనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీని మరింత పటిష్ఠంగా మార్చేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. కాగా అమిత్ షా తెలంగాణ టూర్‌లో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు బీజేపీలో చేరే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం