విదేశాల్లో ముఖ్యమంత్రి.. నలుగురు మంత్రుల అత్యవసర భేటీ.. అసలు మతలబు అదేనా..?

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు.. ముగ్గురు మంత్రులు అత్యవసర భేటీ అయ్యారు. లోక్‌భవన్‌లో ఎట్‌హోమ్‌ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమర్క, శ్రీధర్‌ బాబు, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌.. అక్కడి నుంచి ఒకే కారులో ప్రజా భవన్‌కు చేరుకున్నారు. అయితే.. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో నలుగురు మంత్రుల భేటీ ఉత్కంఠ రేపింది.

విదేశాల్లో ముఖ్యమంత్రి..  నలుగురు మంత్రుల అత్యవసర భేటీ.. అసలు మతలబు అదేనా..?
Deputy Cm Bhatti Vikramarka

Updated on: Jan 27, 2026 | 8:28 AM

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు.. ముగ్గురు మంత్రులు అత్యవసర భేటీ అయ్యారు. లోక్‌భవన్‌లో ఎట్‌హోమ్‌ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమర్క, శ్రీధర్‌ బాబు, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌.. అక్కడి నుంచి ఒకే కారులో ప్రజా భవన్‌కు చేరుకున్నారు. అయితే.. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో నలుగురు మంత్రుల భేటీ ఉత్కంఠ రేపింది. ముఖ్యంగా సింగరేణి టెండర్ల వ్యవహారంపై వారం రోజులుగా రచ్చ కొనసాగుతుండడం.. ఒకట్రెండు రోజుల్లో కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడం.. ప్రత్యేకించి.. నైనీ కోల్ బ్లాక్‌ టెండర్స్‌పై బీఆర్ఎస్‌ నేతలు గవర్నర్‌ను కలవబోతుండడం లాంటి కీలకాంశాలతో మంత్రుల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న వేళ భట్టి విక్రమార్కతో పాటు.. నలుగురు మంత్రులు ప్రజాభవన్‌లో భేటీ కావడం ఉత్కంఠ రేపింది. ముఖ్యమంత్రి లోకల్‌లో లేని సమయంలో సడెన్‌గా నలుగురు మంత్రులు ఎందుకు భేటీ అయ్యారు..? ఏయే అంశాలపై చర్చించారు..? అనేది బిగ్‌ డిబేట్‌కు దారి తీసింది.

ఇక.. డిప్యూటీ సీఎం భట్టి నివాసంలో మంత్రుల ప్రత్యేక భేటీపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ రియాక్ట్‌ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి విదేశాల్లో ఉండడంతో పాలనారపరమైన అంశాలను చర్చించేందుకు.. మంత్రులు సమావేశమైతే తప్పేముందన్నారు. ఢిల్లీలోని AICC ఆఫీసులో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశానికి వెళ్లిన ఆయన.. మంత్రుల భేటీపై ఈ మేరకు కామెంట్స్‌ చేశారు.

ఇదిలావుంటే.. డిప్యూటీ సీఎం భట్టి సారథ్యంలో ప్రజాభవన్‌లో భేటీపై ఆ మంత్రులు కూడా స్పందించారు. డిన్నర్‌కు మాత్రమే వచ్చామని.. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని ఆఫ్‌ ది రికార్డ్‌గా చెప్పుకొచ్చారు. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడం.. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజా భవన్‌లో మంత్రులు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. పాలనాపరమైన అంశాలపై చర్చించేందుకు సమావేశం అయితే తప్పేముందని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ కామెంట్స్‌ చేయడంతో చర్చకు ఫుల్‌స్టాప్‌ పడింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..