Dengue Fever: భాగ్యనగరంలో డెంగ్యూ డేంజర్ బెల్స్‌.. డెంగ్యూ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..

|

Aug 16, 2022 | 3:01 PM

డెంగ్యూ సోకితే శరీర భాగాల్లో హెవీ ఫీవర్‌ లక్షణాలతో పాటు రక్తంలో ప్లేట్ లెట్స్ పడిపోవడం.. చివరికి బ్రెయిన్ డేమేజ్ దాకా దారితీస్తుంది. ముందుగా గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తే .. డెంగ్యూ జ్వరం ప్రాణాంతకమవుతుంది.

Dengue Fever: భాగ్యనగరంలో డెంగ్యూ డేంజర్ బెల్స్‌.. డెంగ్యూ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..
Dengue In Hyderabad
Follow us on

Dengue Fever: డెంగ్యూ కేసులకు హైదరాబాద్‌ నగరం హబ్‌గా మారబోతోందా? నమోదవుతున్న డెంగ్యూ కేసులు అధికారుల్నే బెంబేలెత్తిస్తున్నాయా? ఎస్.. అసలీ డెంగ్యూ వైరస్ ఎటునుంచి ఎటు.. ఏ విధంగా వ్యాపిస్తుంది.. అనే రిసెర్చ్‌ లోతుగానే జరుగుతోంది. ఒకటి కాదు రెండుకాదు.. ఏకంగా 33వేలకు పైగా డెంగ్యూ వైరస్ బ్రీడింగ్‌ పాయింట్స్ గుర్తించింది ఎంటమాలజీ విభాగం. డెంగ్యూ వైరస్ డాట్ పాయింట్స్‌ అధికార యంత్రాంగాల్ని టెన్షన్ పెట్టిస్తున్నాయి.

హైదరాబాద్‌ నగరంలో డెంగ్యూ: డెంగ్యూ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందనేది ఓపెన్ సీక్రెట్. ఒక్క హైదరాబాద్‌ నగరంలో డెంగ్యూను వ్యాప్తిచేసే 33వేల కేంద్రాలను గుర్తించింది జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ డిపార్ట్‌మెంట్‌. ఎస్.. మన మధ్యనే మన ఇళ్లలో.. ఓపెన్ ప్లేసుల్లో 33 వేల చోట్ల సైలెంట్‌గా డెంగ్యూ వైరస్ రీప్రొడక్షన్ జరుగుతోంది. ప్రధానంగా ఏడెస్ ఈజిప్టి (Aedes aegypti) జాతికి చెందిన దోమల ద్వారా డెంగ్యూ వ్యాప్తి జరుగుతుంది. టైగర్ మస్కిటోగా పిలువబడే ఈ ఆడ దోమ ఎక్కడెక్కడ పెరుగుతుంది.. ఎలా ఎదుగుతుంది.. అనే విషయాల్ని శాస్త్రీయంగా ఐడెంటిఫై చేశారు ఎంటమాలజిస్టులు.

ఎలా డెంగ్యూ దోమలు ఉత్పత్తి పెరుగుతుందంటే..కుంటలు.. నిర్మాణంలో ఉన్న భవనాలు, నీరు నిల్వ ఉండే ప్రదేశాలు… ఇలా 30వేలకు పైగా డెంగ్యూ డేంజర్ పాయింట్లను టైగర్‌ మస్కిటో బ్రీడింగ్‌ సెంటర్లుగా గుర్తించింది జిహెచ్‌ఎంసీ. 2,500 మంది సిబ్బందితో ఈ సైంటిఫిక్ రిసెర్చ్ జరిగిందట. ఇవన్నీ కేవలం స్లమ్ఏరియాలే కాదు… బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లోనూ ఉన్నాయి. లార్వాను గుర్తించడంలో ఎక్కడ నిర్లక్ష్యం జరిగినా డెంగ్యూ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ సెంటర్లలో డెంగ్యూకు కారణమైన ఒక్కో టైగర్ మస్కిటో వేల సంఖ్యలో లార్వాను ఉత్పత్తి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

దోమలు పెరిగే ప్రాంతాలు: ఇటువంటి డెంగ్యూ ఉత్పత్తి సెంటర్లు నగరంలో అనేక ప్రాంతాల్లో కన్పిస్తున్నాయి. చిన్న పాత్రల నుంచి పూలకుండీలు, పెద్దపెద్ద వాటర్ ట్యాంకుల వరకూ.. మనం తేలిగ్గా తీసుకునేవన్నీ డెంగ్యూ వైరస్ ఉత్పత్తి సెంటర్లే. వీటిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది ఎంటమాలజీ డిపార్టుమెంట్. సిబ్బందితో వెళ్లి డెంగ్యూ వైరస్ ఉత్పిత్తి చేసే లార్వాను నిర్మూలించే చర్యలు షురూ చేశారు. ప్రధానంగా డెంగ్యూ కారక దోమలు మంచినీటిలోనే పునరుత్పత్తి సాగిస్తుంటాయనే షాకింగ్ డీటెయిల్స్ రివీల్ చేస్తోంది జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్.

ప్రమాదకరంగా ఎప్పుడు మారతాయంటే: టైగర్ మస్కిటోతో డెంగ్యూనే కాదు.. ఈదోమలు గర్భిణిలను కుడితే.. ఇంకా డేంజర్. ఏకంగా జికా వైరస్ వ్యాప్తిక్కూడా ఈ దోమలే కారణం. అందుకే బీ అలర్ట్ అంటున్నారు అధికారులు. డెంగ్యూ సోకితే శరీర భాగాల్లో హెవీ ఫీవర్‌ లక్షణాలతో పాటు రక్తంలో ప్లేట్ లెట్స్ పడిపోవడం.. చివరికి బ్రెయిన్ డేమేజ్ దాకా దారితీస్తుంది. ముందుగా గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తే .. డెంగ్యూ జ్వరం ప్రాణాంతకమవుతుంది.

కరోనాకు ముందు డెంగ్యూ ఫీవర్లు వణికించాయి. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది. పైగా… డెంగ్యూ నిర్ధారణ పరీక్షల్ని రెండు రకాలుగా చేయాల్సి వస్తోందంటున్నారు పెథాలజిస్టులు. వాతావరణం మారింది. దాంతోపాటే చాపకింద నీరులా డెంగ్యూ కేసులూ పెరుగుతున్నాయి. 30వేలకు పైగా స్థావరాలేర్పరుచుకుని వేగంగా వ్యాప్తి చెందుతున్న డెంగ్యూ వైరస్‌కి మాతో పాటు మీరూ అడ్డుకట్ట వెయ్యకపోతే.. భాగ్యనగరంలో మరోసారి డెంగ్యూ డేంజర్ బెల్స్‌ మోగించక తప్పదన్నది అధికారుల హెచ్చరిస్తున్నారు.

Reporter: Srihari, TV9 Telugu

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..