Degree Student Suicide Case: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఉంటున్న హాస్టల్ లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. గోలి రక్షిత అనే విద్యార్థిని స్థానికంగా ఉన్న నరేంద్ర డిగ్రీ కళాశాలలో రక్షిత డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో రక్షిత.. పట్టణంలోని ఎస్సీ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ క్లాసులకు హాజరవుతోంది.. ఏమైందో ఏమో తెలియదు కానీ.. రక్షిత ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడింది. హాస్టల్ రూం నుంచి బయటకు రాకపోవడంతో.. హాస్టల్ సిబ్బంది చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు.. వివరాలను సేకరించారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం.. మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రక్షిత మరణానికి కారణం ఏంటీ..? ఎందుకిలా చేసుకుని ఉంటుంది.. ఆమె ఫ్రెండ్స్ ను ఆరా తీస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..