Degree Exams in Telangana: డిగ్రీ విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ ద్వితీయ, చివరి సంవత్సరం విద్యార్థుల వార్షిక పరీక్షలను మార్చి, ఆగస్టులో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమీక్ష అనంతరం ఉన్నత విద్యామండలి అధికారులు కూడా భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
విద్యార్థులకు తొలుత 30 నుంచి 40 తరగతులు నిర్వహించాక మార్చిలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ద్వితీయ, చివరి సంవత్సరం విద్యార్థులకు 3, 5వ సెమిటర్లు పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఫిక్స్ అయ్యారు. ఆ తరువాత ఆగస్టు వరకు పూర్తిస్థాయిలో ప్రత్యక్ష తరగతులు నిర్వహించి.. 4, 6 సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.
Also read:
87 ఏళ్ల చరిత్రకు బ్రేక్ పడింది.. కరోనా మార్గదర్శకాల మధ్య రంజీ ట్రోఫీ నిర్వహించలేమన్న బీసీసీఐ
Varun Tej: ‘గరుడవేగ’ డైరెక్టర్‌తో చేతులు కలపనున్న మెగాహీరో.. సినిమా షూటింగ్ మొత్తం లండన్‌లోనే..