Holidays: రేపటి నుంచే దసర సెలవులు.. విద్యార్థులకు పండగే పండుగ..

|

Oct 12, 2023 | 11:06 AM

Dasara Holidays in Telangana: తెలుగు రాష్ట్రాల్లో దసరా కళ వచ్చేసింది. తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రవేట్ స్కూల్స్‌కి ఈ నెల 13వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. పండుగ తరువాత అంటే 26వ తేదీన స్కూల్స్ తిరిగి ఓపెన్ అవుతాయి. స్కూల్స్‌లో సమ్మెటివ్ ఎగ్జామ్స్(SA1) నిన్నటితోనే ముగియగా.. ఇవాళ ఒక్క రోజు స్కూల్ ఉంటుంది. మరుసటి రోజు నుంచి అంటే శుక్రవారం నుంచి సెలవులు ఉంటాయి. ఇక ఫలితాలను స్కూల్స్ పునఃప్రారంభం అయిన తరువాత ప్రకటిస్తారు.  జూనియర్ కాలేజీలకు ఈ నెల 19వ తేదీ నుంచి దసరాలు సెలవు ప్రారంభం కానుంది.

Holidays: రేపటి నుంచే దసర సెలవులు.. విద్యార్థులకు పండగే పండుగ..
Dasara Holidays
Follow us on

Dasara Holidays in Telangana: తెలుగు రాష్ట్రాల్లో దసరా కళ వచ్చేసింది. తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రవేట్ స్కూల్స్‌కి ఈ నెల 13వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. పండుగ తరువాత అంటే 26వ తేదీన స్కూల్స్ తిరిగి ఓపెన్ అవుతాయి. స్కూల్స్‌లో సమ్మెటివ్ ఎగ్జామ్స్(SA1) నిన్నటితోనే ముగియగా.. ఇవాళ ఒక్క రోజు స్కూల్ ఉంటుంది. మరుసటి రోజు నుంచి అంటే శుక్రవారం నుంచి సెలవులు ఉంటాయి. ఇక ఫలితాలను స్కూల్స్ పునఃప్రారంభం అయిన తరువాత ప్రకటిస్తారు.  జూనియర్ కాలేజీలకు ఈ నెల 19వ తేదీ నుంచి దసరాలు సెలవు ప్రారంభం కానుంది. 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వారికి ఈ సెలవులు ఉంటాయి. ఆ తరువాత రోజు నుంచి యధావిధిగా తరగతులు ప్రారంభం అవుతాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది.

దసరా సెలవులో మార్పు..

దసరా సెలవు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవును 23, 24కి మార్చేసింది. అంతకు ముందు 24, 25 తేదీలలో దసరా సెలవు ప్రకటించగా.. రెండు రోజుల క్రితం సెలవులపై క్లారిటీ ఇచ్చింది. దసరా పండుగ 23, 24 తేదీల్లోనే అని క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది అధిక మాసం కారణంగా దసరా పండుగ విషయంలో కన్‌ఫ్యూజన్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే క్లారిటీ సెలవులో మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

బతుకమ్మ సంబరాలు..

ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను ప్రభుత్వ పండుగగా గుర్తించిన నేపథ్యంలో.. అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు.. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

పిల్లలు జాగ్రత్త..

దసరా సెలవులు వచ్చాయంటే చాలు పిల్లలకు పండుగ ముందే వచ్చినట్లు ఉంటుంది. ఈ సెలవుల్లో చాలా మంది పిల్లలు తమ తమ స్వగ్రామాలకు, అమ్మమ్మల ఇళ్లకు వెళ్తుంటారు. అక్కడ స్నేహితులతో సరదాగా గడుపుతుంటారు. అయితే, పిల్లలు బయటకు వెళ్లే విషయంలో తల్లిదండ్రులు, పెద్దలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సరదాగా ఆడుకునేందుకు చెరువులు, బావుల వద్దకు వెళ్తుంటారు. ఈత రాకపోయినా.. ఈత కొట్టేందుకు లోపలికి దిగి ప్రాణాల మీదుకు తెచ్చుకుంటారు. అందుకే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..